బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై కేటీఆర్ వరాల జల్లు

ABN , First Publish Date - 2022-12-10T12:40:41+05:30 IST

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. బాసర ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై కేటీఆర్ వరాల జల్లు

నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. బాసర ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు నీరు అందిస్తామన్నారు. క్యాంపస్ విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున మొత్తం సోలార్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే టి హబ్ ప్రారంభిస్తామన్నారు. నూతన ఆవిష్కరణలకు అవసరమైన తర్ఫీదు ఇస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. రూ.5 కోట్లతో సైన్స్ క్లబ్ ఏర్పాటు చేస్తామన్నారు. క్యాంపస్‌లోని చెరువును సుందరీకరణ చేస్తామన్నారు. ఈ పనులన్నీ వెంటపడి పూర్తి చేయించే బాధ్యత తనదని.. మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తానన్నారు. మేధస్సు మీద విశ్వాసం ఉంటే ఎంత దాకైనా పోవచ్చన్నారు. 10 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని.. నాణ్యమైన భోజనం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రపంచంతో పోటీపడే సత్తా విద్యార్థులకు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-10T12:40:43+05:30 IST