కోటగుళ్లలో గుప్తనిధుల కలకలం

ABN , First Publish Date - 2022-10-13T04:49:04+05:30 IST

కోటగుళ్లలో గుప్తనిధుల కలకలం

కోటగుళ్లలో గుప్తనిధుల కలకలం

చెల్పూరు, అక్టోబరు 12: భూపాలపల్లి జి ల్లా గణపురం మండల కేంద్రంలోని పురాతన కోటగుళ్లలో గుప్త నిఽధుల తవ్వకాలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ఆలయ ఆవరణలో గుంతను తవ్వడం చర్చనీయాంశమైంది. భవానీ సహిత గణపేశ్వరాలయం పూజారి నరేష్‌ రోజేలాగే బుధవారం ఉదయం ఆలయానికి వెళ్తుండగా జమ్మిచెట్టు కింద గుంత కనిపించింది. దీంతో ఆయన  ఆలయ కమిటీకి సమాచారం ఇచ్చారు. ఈ నేప థ్యంలో కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సం ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అభినవ్‌, క్లూస్‌ టీం బృందం సభ్యులు గుంతను పరిశీలించారు. సుమారు ఐదు అడుగుల లోతులో గుంత తవ్వి ఉండి పక్కనే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, తేలికపాటి ఇసుక తదితర సామ గ్రి ఉన్నాయి. ఈ తవ్వకాలు చేసిన వారు స్థానికులా.. ఇతర ప్రాంతాల వారా.. వారికి గుప్త నిఽధులు దొరి కాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకతీయ రాజులు నిర్మించిన ఆలయం కావడంతో గుప్త నిధులు ఉన్నాయనే ఉద్దేశంతోనే తవ్వకాలు జరిపినట్టు తెలుస్తోంది. 2017 జనవరిలో ఇదే ప్రదేశంలో గుప్తనిధుల కోసం గుర్తుతె లియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన దాఖలాలు ఉన్నాయి. పోలీసులు అప్పట్లో సొమ్మును రికవరీ చేసిన  సందర్భాలు ఉన్నాయి.

Read more