ప్రియాంకగాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

ABN , First Publish Date - 2022-08-25T01:44:34+05:30 IST

ప్రియాంకగాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

ప్రియాంకగాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

ఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ ముగిసింది. మునుగోడు బైపోల్, పార్టీలో అంతర్గత అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.... టి.కాంగ్రెస్‌ బలోపేతంపై ప్రియాంకతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో తాజా పరిస్థితులు, వచ్చే ఎన్నికలపైనా చర్చించామని తెలిపారు. ఓ ఫంక్షన్ కారణంగా మొన్నటి భేటీకి రాలేకపోయానని చెప్పినట్లు వెల్లడించారు. టి.కాంగ్రెస్‌ బలోపేతానికి సలహాలు ఇచ్చానని పేర్కొన్నారు. అందరూ కలిసి టీమ్‌ వర్క్‌ చేయాలని ప్రియాంకగాంధీ సూచించారని ఆయన అన్నారు. ఏ సమస్య ఉన్నా చెప్పాలని ప్రియాంక సూచించారని చెప్పారు. 

Read more