రైతుల కుటుంబాలను ఆదుకోండి: కిసాన్‌ కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-06-07T08:46:52+05:30 IST

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు జీవో 194ను అమలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ను

రైతుల కుటుంబాలను ఆదుకోండి: కిసాన్‌ కాంగ్రెస్‌

 రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు జీవో 194ను అమలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ను కిసాన్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం కోరింది. కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి నేతృత్వంలో సోమవారం వ్యవసాయ శాఖ కమిషనర్‌ను కలిసిన ప్రతినిధి బృందం ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. కాగా, రైతు ఆత్మహత్యలు, మహిళా రైతుల అరెస్టు తదితర సమస్యలపై వ్యవసాయ కమిషనరేట్‌కు బయల్దేరిన కిసాన్‌ కాంగెరస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలకు పెనుగులాట జరిగింది. అన్వే్‌షరెడ్డిని బలవంతంగా ఎక్కించిన కారును కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. చివరికి వ్యవసాయ శాఖ కమిషనర్‌ను కలిసేందుకు అన్వే్‌షరెడ్డి, మరి కొందరిని పోలీసులు అనుమతించారు. 

Read more