యువతే దేశానికి బలం

ABN , First Publish Date - 2022-11-25T00:09:25+05:30 IST

యువతే దేశానికి బలమని ప్రముఖ రచయిత, వ్యక్తిత్త వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్‌ అన్నారు.

యువతే దేశానికి బలం
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వీరేంద్రనాథ్‌

ఖమ్మం ఖానాపురంహవేలి, నవంబరు 24: యువతే దేశానికి బలమని ప్రముఖ రచయిత, వ్యక్తిత్త వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్‌ అన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షే త్రంలో మిత్ర ఫౌండేషన్‌, విశిష్ట ఫౌండేషన్‌, బాలాజీ ఎస్టేట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాస నైపుణ్య పెంపుదల కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా యండమూరి వీరేంద్రనాథ్‌, గంపా నాగేశ్వరరావు, ముని సిపల్‌ కమిష నర్‌ ఆదర్శసురభి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మంచి చెడులుంటా యని, నలుగురిని పలకరిస్తూ కలుపుకుంటూ పోవాలన్నా రు. మనిషి జన్మకు ఒక అర్థం ఉండాలని, ఆ దిశగా నడుచుకోవాలన్నారు. మంచి మాటలు వినడానికి మొదట కష్టంగానే ఉంటాయని, పోనుపోను జీవితంలో అవే సక్రమ మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతా యన్నారు. మీ ఎదుగుదల వల్ల వందమందికి జీవనోపాధి కలిపించి ఆదర్శంగా నిలిచినప్పుడే మీరు జీవితంలో విజయం సాధించినట్టన్నారు. మీరు చేసే ప్రతి పని ఒక టికి పదిసార్లు మనసును అడిగి ఆలోచించి చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. సమాజంతో కూడిన విలువలను నేర్చుకున్నప్పుడే విద్యకు, నేర్పిన గు రువుకు ఫలితం దక్కుతుందన్నారు. ఇదే వారికి మనం ఇచ్చే గురుదక్షిణ అన్నారు. ఏ చదువుకైనా సంస్కరణ ఉం ది కాని, సంస్కారానికి గురువు లేదని, తల్లిదండ్రులతో మంచిగా నడుచుకోవాలన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు దృష్టి సారించి, వారు ఏం చేస్తున్నారు, వారి ఆలోచన విధానం ఏవిధంగా దృష్టి పెట్టాలన్నారు. ముందుగా ఇం పాక్ట్‌ నిర్వాహకులతో యండమూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. మొదటగా మిత్ర ఫౌండేన్‌ చైర్మన్‌ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇంపాక్ట్‌ కార్యక్రమం గతంలో కూడా నిర్వహించామన్నారు. కరోనా కారణంగా రెండేళ్ల విరామం అనంతరం ఈ ఏడాది ని ర్వహిస్తున్నామన్నారు. మిత్ర ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో కా ర్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లా విద్యార్థులకు, యువతీ, యువకులకు జీవితంలో ఉపయోగపడే విధం గా వ్యక్తిత్వ వికాస పెంపుదల కార్యక్రమాలు నిర్వహిం చ డం ఆనందంగా ఉందన్నారు.. అనంతరం కార్యక్రమా నికి హాజరైన సుమారు వెయ్యిమంది విద్యార్ధులందరికి మ ధ్యాహ్న భోజనం అందించారు. కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాఘవేంద్ర, జగన్‌ గురూజీ విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉత్తేజ పరి చారు. ఈ కార్యక్రమంలో విశిష్ట ఫౌండేషన్‌ చైర్మన్‌ గుర్రం శ్రీనివాస్‌, బాలాజీ ఎస్టేట్‌ అధినేత వత్సవాయి రవి, మిత్ర ఫౌండేషన్‌ కార్యదర్శి రంగా శ్రీనివాస్‌, చెరకూరి యు గంధర్‌, టీఎన్‌జీవో నాయకులు అప్జల్‌ హసన్‌, మహం కాళి నగేష్‌, చారుగుండ్ల రవికుమార్‌, బొమ్మిడి సునిల్‌, వే ములపల్లి సీతారాంబాబు, పుల్లఖండం శ్రీకర్‌, పి.ఉపేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:09:25+05:30 IST

Read more