బదిలీలతో మునిసిపాలిటి ఖాళీ

ABN , First Publish Date - 2022-02-19T05:32:06+05:30 IST

అసలే అంతంత మాత్రంగా ఉన్న అధికారులు... ముఖ్యమైన పోస్టులన్నీ ఏళ్ల తరబడి భర్తీకాకుండా ఉంటున్నాయి.

బదిలీలతో మునిసిపాలిటి ఖాళీ
ఇల్లెందు మునిసిపల్‌ కార్యాలయం

- కమిషనర్‌తో సహా పలువురికి స్థానచలనం

- బదిలీ స్థానంలో కొత్తవారు కరువు

ఇల్లెందుటౌన్‌, ఫిబ్రవరి18: అసలే అంతంత మాత్రంగా ఉన్న అధికారులు... ముఖ్యమైన పోస్టులన్నీ ఏళ్ల తరబడి భర్తీకాకుండా ఉంటున్నాయి. కొద్దిమంది అధికారులతో సాగుతున్న ఇల్లెందు మునిసిపాలిటిలో ఇటీవల కాలంలో ముఖ్య మైన అధికారులు, సిబ్బంది బదిలీ కావడంతో ప్రస్తుతం మునిసిపాలీ అంతా ఖాళీగానే దర్శనమిస్తోంది. 104మంది అధికారులు, సిబ్బంది ఉండాల్సిన ముని సిపాలిటిలో కేవలం 50మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తుండగా వారిలో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌తో సహా ఇటీవల బదీలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనం జోన్‌ల వారిగా బదీలీలు చేయడంతో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌, రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న అంజన్‌కుమార్‌ చార్మినార్‌ జోన్‌ పరిధిలో గల మునిసి పాలిటికి బదీలీ అయ్యారు. ఆయనతోపాటు ఇతర శాఖల అధికారులు కూడా తమ తమ జోన్‌లలో బదీలీ అయ్యారు. అయితే బదీలీఅయిను అధికారులు కేటాయించిన స్దానాల్లో రిపోర్టు చేసి తిరిగి యధాతదంగా పనిచేసే ముని సిపాలిటిల్లో విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటీకీ ఇప్పటివరకు బదీలీ అయిను వారు తిరిగి వెనక్కి ఎవరు రాలేదు. దీంతో ముఖ్యమైన స్ధానాల్లో అధికారులు లేక కార్యాలయం వెలవెలబోతోంది. ప్రదాన అధికారులు లేకపోవడంతో ముఖ్య మైన పనులు నిలిచిపోతున్నాయి. దీంతో  పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అభివృద్ధి పనులను పర్వవేక్షించాల్సిన ఇంజనీరింగ్‌ విభాగంలో ఎఈలు, డీఈ, వర్క్‌ఇన్స్‌ఫెక్టర్లు తదితర ఖాళీలతో ఉం డటంతో కేవలం కాంట్రాక్టు అధికారులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇన్‌చార్జీ డీఈగా పంచాయతీరాజ్‌ డీఈని నియమించి పనులును చేపడుతున్నారు. కాంట్రాక్టు పద్దతుల్లో రిటైర్డ్‌ అయిన ఇద్దరు ఎఈలు పనిచేస్తున్నారు. అయితే పూర్తి స్ధాయి అధికారులు ఇంజనీరింగ్‌ విభాగంలో లేకపోవడంతో అభివృద్ధి పనుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. మునిసిపాలిటికి ఆదాయం సమకూర్చే రెవెన్యూ విభాగంలో సైతం అనేక ఖాళీలు ఉన్నప్పటీకీ భర్తీ చేయకుండా ఉండటంతో రెవెన్యూ లోటు తీవ్రంగా ఉంది. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో కూడా ఖాళీలే దర్శనమిస్తున్నాయి. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది లేకపో వడంతో అభివృద్ధితోపాటు పాలనసైతం కుంటుపడుతుందని ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నాతాధికారులు దృష్టిసారించి ఖాళీలు భర్తీ చేయాలని, లేదంటే బదీలీ అయిన వారిస్ధానంలోనైనా నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడంతో ఇల్లెందు అభివృద్ధి కుంటుపడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 


Updated Date - 2022-02-19T05:32:06+05:30 IST