తెరవెనుక ఎందరో?

ABN , First Publish Date - 2022-09-19T06:42:19+05:30 IST

తెరవెనుక ఎందరో?

తెరవెనుక ఎందరో?

రామానుజవరం ఇసుక వ్యవహారంపై విస్తృత చర్చ

చర్చానీయంశమై ‘ఆంధ్రజ్యోతి’ కథనం 

దందాలో స్థానిక నేతలు, ప్రముఖుల హస్తంపై చర్చ

మణుగూరుటౌన, సెప్టెంబరు 18 : పదేళ్లుగా మణుగూరు సబ్‌డివిజన్‌లో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందా విషయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రామానుజవరం పంచాయతీ పరిధిలోని ఇసుక ర్యాంపు ఇప్పిస్తానని చెప్పి రూ.90 లక్షల నగదు తీసుకుని మోసం చేసారన్న విషయంలో హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీ్‌సస్టేషనలో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. దీనిపై ‘పెట్టుబడి పేరుతో రూ.90 లక్షలకు టోకరా’ అన్న శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో శనివారం ప్రచురితమైన కథనం అక్రమార్కుల్లో ప్రకంపనలు సృష్టించింది. మణుగూరు సబ్‌ డివిజనలో మూడు పువ్వులు.. ఆరుకాయలుగా విరాజిల్లుతున్న ఇసుక దందాలో పలువురు నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు అతి తక్కువ కాలంలో రూ.లక్షల్లో సంపాదించారన్న చర్చ జరుగుతోంది. అయితే మణుగూరు మండలంలోని రామానుజవరం పంచాయతీ పరిధిలో ఇసుక ర్యాంపు ఇప్పిస్తానని చెప్పి రూ.90లక్షల నగదు తీసుకుని మోసం చేశారన్న కేసు హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీ్‌సస్టేషనలో నమోదు కావడం ఇక్కడ సంచలనంగా మారింది. ఆ కేసులో భద్రాద్రి జిల్లాతో సంబంధం లేని పోలీస్‌ కమిషనర్‌, మాజీ మంత్రి, కమిషనర్‌ కుమారుడు, మంత్రి అల్లుడు ముఖ్య పాత్రదారులుగా ఉన్నట్టు ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ లావాదేవిల్లో జిల్లాకు, స్థానిక గ్రామానికి చెందిన నాయకులు, ప్రముఖుల ప్రమేయాలున్నట్లు కొందరు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని సోషల్‌ మీడియాల్లో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. 


బయటకు రాని బాధితులెందరో..

ఇసుకకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో అనతి కాలంలో లక్షలు సంపాదించవచ్చన్న భావనతో నాయకులు, ప్రముఖ వ్యాపారులు, కాంట్రాక్టర్లతో పాటు సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఈ దందావైపు దృష్టి సారించారు. దీంతో ఇసుక ర్యాంపు అనుమతి కోసం.. ర్యాంపులో వాటాల కోసం పోటీ ఏర్పడింది. ఇదే అదనుగా మణుగూరు సబ్‌ డివిజనలో ఇసుక ర్యాంపు ఇప్పిస్తామంటూ పలువురు రూ.లక్షల్లో వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మణుగూరులో ఇసుక వ్యాపారం చేద్దామని వచ్చిన ఖమ్మానికి చెందిన ఓ వ్యాపారి ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడగా.. ఈ ప్రాంతానికి ఇసుక వ్యాపారం కోసం వచ్చిన ఏపీ రాష్ట్రంలోని గుడివాడ, తెలంగాణలోన కరీనంగర్‌, హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరితోపాటు స్థానిక రిటైర్డ్‌ సింగరేణి కార్మికుడు, మధ్యతరగతికి చెందిన మణుగూరు పట్టణ నాయకులు ఉన్నదంతా పోగొట్టుకుని నష్టపోయినట్టు తెలుస్తోంది. ఇసుక ర్యాంపు నిర్వహణలో అనుభవం లేకపోడం నష్టపోవడానికి ఓ కారణంగా చెబుతుండగా.. అనుభజ్ఞులతో కలసి వ్యాపారం చేసినవారు దీనిలోని లోటుపాట్లు తెలియక పార్టనర్‌ చేతుల్లో మోసపోయిన వారి సంఖ్య బాగానే ఉన్నట్టు పలువురు పేర్కొంటున్నారు. ఏదేమైనా పంజాగుట్ట పోలీ్‌సస్టేషనలో నమోదైన కేసులో స్థానికులకు ప్రమేయముందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.Read more