అందని భగీరథ నీరు

ABN , First Publish Date - 2022-07-18T05:59:10+05:30 IST

మిషన్‌ భగీరఽథ పఽథకం మండలంలో పడకేసింది. గోదావరికి వరదల కారణంగా పలు గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదు.

అందని భగీరథ నీరు
ఖాళీగా హెడ్‌ వాటర్‌ ట్యాంకులు

గోదావరి వరదల వల్ల నిలిచిన సరఫరా

చండ్రుగొండ, జూలై 17: మిషన్‌ భగీరఽథ పఽథకం మండలంలో పడకేసింది. గోదావరికి వరదల కారణంగా పలు గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో మండలంలోని ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. మిషన్‌ భగీరథ నీరు సరఫరా కాని కారణంగా గతంలో హెడ్‌ వాటర్‌ ట్యాంకులకు నీటిని సరఫరా చేసిన బోరుబావులు, చేతి పంపులు మరమ్మతులు లేక మూలన పడ్డా యి. దీంతో తాగునీరు లేక వందలాది కుటుంబాలు నీటికోసం వెతుకులాట ప్రారంభించాయి. ప్రజలు చేతి పంపుల వద్ద క్యూ కడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ఇంటికి రెడుమూడు బిందెల నీటిని మాత్రమే అందివ్వగలుగుతున్నారు.

Read more