గేట్‌లో వైరా యువకుడికి 88వ ర్యాంకు

ABN , First Publish Date - 2022-03-19T04:35:16+05:30 IST

ఆలిండియాస్థాయి గేట్‌లో వైరాలోని శాంతినగర్‌కు చెందిన గుదిమెళ్ల శ్రీరామ్‌చరణ్‌కు 88వ ర్యాంకు లభించింది.

గేట్‌లో వైరా యువకుడికి 88వ ర్యాంకు

వైరా, మార్చి 18: ఆలిండియాస్థాయి గేట్‌లో వైరాలోని శాంతినగర్‌కు చెందిన గుదిమెళ్ల శ్రీరామ్‌చరణ్‌కు 88వ ర్యాంకు లభించింది. వైరాలోని శాంతినగర్‌కు చెందిన సంస్కృత అధ్యాపకుడి శ్రీ వెంకటరాఘవచార్యులు, విజయలక్ష్మీ దంపతుల సంతానమైన శ్రీరామ్‌చరణ్‌ 88వ ర్యాంకు సాధించిన తన సత్తా చాటుకున్నాడు. హైదరాబాద్‌ బిట్స్‌పిలానీలో బీటెక్‌ పూర్తిచేసిన శ్రీరామ్‌చరణ్‌ ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఇండియా ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. ఎలక్ట్రీకల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో గేట్‌ పరీక్షలు రాశాడు. ఆలిండియా సర్వీ్‌సల్లో ఒకటైన ఐఈఎస్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈసమయంలో గేట్‌ ఫలితాల్లో 88వ ర్యాంకు వచ్చింది. దేశంలోనే ఉన్నతస్థాయి అధికారిగా ప్రజలకు సేవ చేయాలన్నదే తన జీవిత లక్ష్యమని శ్రీరామ్‌చరణ్‌ తెలిపారు.


Read more