ఘనంగా వనసమారాధన వేడుకలు

ABN , First Publish Date - 2022-11-27T22:51:07+05:30 IST

వైరాలో ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.

ఘనంగా వనసమారాధన వేడుకలు
వైరాలో గౌడ కులస్థులు వనసమారాధన

వైరా, నవంబరు27: వైరాలో ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. వనస మారాధన మహోత్సవంగా సమ్మేళనాన్ని జరుపుకున్నారు. రాష్ట్ర మార్కెఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మాజీ జడ్పీటీసీ బొర్రా ఉమాదేవి ముఖ్యఅతిధులుగా పాల్గొ న్నారు. గౌడ సంఘం ఔనత్యం గురించి వివరించారు. ఆటపాటలు, డ్యాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఆత్మకమిటీ ఛైర్మన్‌ కోసూరి శ్రీనివా సరావు, పర్సా రవి, ఉయ్యూరి రామకృష్ణ, బాలబోయిన నర్సింహారావు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫొటోగ్రాఫర్ల వనసమారాధన మహోత్సవం

కల్లూరు, నవంబరు 27: కల్లూరు మండల ఫొటో గ్రాఫర్ల వనసమారాధన మహోత్సవం ఆదివారం జరిగిం ది. ఈ సందర్భంగా చంద్రుపట్ల రహదారి వైపన గల మా మిడితోటలో కుటుంబ సమేతంగా ఫొటోగ్రాఫర్లు స మారాధనకు ఉత్సాహంగా తరలివచ్చి ఆటపాటలతో సం దడి చేశారు. ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వే ములూరి నాగరాజు సత్తుపల్లి డివిజన్‌ నాయకులు దేవర హరి మాట్లాడుతూ కరోనా కారణంగా కొంతకాలం వ నసమారాధన కార్యక్రమాలు నిలిచాయని, తిరిగి కు టుంబ సభ్యులతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మర్రెల విజయ నాగేశ్వరరావు, కల్లూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు చల్లా వెంకటేశ్వరరావు, జానపాటి వేణు, కోశాధికారి డేవిడ్‌, మండల ఫొటోగ్రాఫర్ల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T22:51:15+05:30 IST