రేపటినుంచి రెండు రాష్ట్రాలస్థాయి నాటక పోటీలు

ABN , First Publish Date - 2022-03-17T04:25:39+05:30 IST

మధిర మండలం మాటూరుపేట సీతారామాంజనేయ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో మధిర రిక్రీయేషన్‌క్లబ్‌ కల్యాణమండంలో శుక్రవారంనుంచి మూడురోజులపాటు తెలుగు రాష్ట్రాలస్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహాకులు పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్‌, గడ్డం సుబ్బారావు, గడ్డం శ్రీనివాసరావు తెలిపారు.

రేపటినుంచి  రెండు రాష్ట్రాలస్థాయి నాటక పోటీలు

మధిర రూరల్‌, మార్చి 16: మధిర మండలం మాటూరుపేట సీతారామాంజనేయ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో మధిర రిక్రీయేషన్‌క్లబ్‌ కల్యాణమండంలో శుక్రవారంనుంచి మూడురోజులపాటు తెలుగు రాష్ట్రాలస్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహాకులు పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్‌, గడ్డం సుబ్బారావు, గడ్డం శ్రీనివాసరావు తెలిపారు. 18,19,20తేదీల్లో పౌరాణిక, సాంఘీక నాటక పోటీలు నిర్వహిస్తామన్నారు. పౌరాణిక, సాంఘీక, రాగ, తాళ, బావ యుక్త కళల్లో పాల్గొనే కళాకారులు 9440313937లో సంప్రదించాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే కళాకారులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు.


Read more