వైభవంగా నాగుండ్లమ్మ, ముత్యాలమ్మ పూజలు

ABN , First Publish Date - 2022-06-12T04:03:36+05:30 IST

గుండుగులపల్లి- పట్వారిగూడెం మద్యలో గుట్టపైన వున్న నాగుండ్లమ్మ ముత్యాలమ్మ, కనకదుర్గమ్మ అమ్మవార్ల వార్షికోత్సవ తిరునాళ్ళ సందర్భంగా శనివారం వైభవంగా పూజలు నిర్వహించారు.

వైభవంగా నాగుండ్లమ్మ, ముత్యాలమ్మ పూజలు
పూజలో పాల్గొన్న తుమ్మల

దమ్మపేట,  జూన్‌ 11: గుండుగులపల్లి- పట్వారిగూడెం మద్యలో గుట్టపైన వున్న నాగుండ్లమ్మ ముత్యాలమ్మ, కనకదుర్గమ్మ అమ్మవార్ల వార్షికోత్సవ తిరునాళ్ళ సందర్భంగా శనివారం వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని పూజలు చేసారు. మండల పరిదిలోని పలుగ్రామాల నుండి భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు,  కాసాని నాగప్రసాద్‌ , ఎర్రా వసంతరావు, తుమ్మల శేషుబాబు, తుమ్మల వెంకటేశ్వరరావు, నరుకుళ్ల చెన్నారావు, మండవ సత్యనారాయణ,  ఓబిలిశెట్టి సత్యనారాయణ, వట్టి వెంకట్రావు, వట్టి రమేష్‌, పసుపులేటి అచ్యుతరావు, ధనేకుల కృష్ణారావు తదితులు పాల్గొనారు.


Read more