టీఆర్‌ఎస్‌ నాయకులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-03-19T05:16:10+05:30 IST

మండలానికి చెందిన తొమ్మిది మంది టీఆర్‌ఎస్‌ నాయకులపై ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం కేసునమోదయింది.

టీఆర్‌ఎస్‌ నాయకులపై కేసు నమోదు
పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

ఖమ్మం రూరల్‌, మార్చి 18: మండలానికి చెందిన తొమ్మిది మంది టీఆర్‌ఎస్‌ నాయకులపై ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం కేసునమోదయింది. మండల పరిధిలోని నాయుడుపేటకు చెందిన మేకల ఉదయ్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో మాజీ మంత్రి తుమ్మలను ఉద్దేశించి అనుచిత పోస్టులు పెట్టాడు. వాటిని చూసిన 59వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ జంగం భాస్కర్‌ మేకల ఉదయ్‌కి ఫోన్‌ చేసి తుమ్మల గురించి తప్పుడు పోస్టులు పెడితే సహించేదిలేదని ఆగ్రహించాడు. దీంతో ఉదయ్‌ జంగం భాస్కర్‌పై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి భాస్కర్‌ను అరెస్టు చేశారు. దీంతో నాయకులు, కార్యర్తలు పెద్దఎత్తున తరలివచ్చి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద అర్ధరాత్రి ధర్నా నిర్వహించారు. దీంతో వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో పోలీసులకు, నాయకులకు కొంతసేపు తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు కొందరు నాయకులతో మాట్లాడటంతో వారు ధర్నాను విరమించారు. 

తొమ్మిది మందిపై కేసులు

పోలీస్‌ స్టేషన్‌ ముందు నాయకులు అర్ధరాత్రి దాటే వరకు ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బండి జగదీశ్‌, శాఖమూరి రమేశ్‌, జొన్నలగడ్డ రవి, బానోత్‌ కృష్ణ, మహిపాల్‌, బానోత్‌ వీరన్న, తమ్మినేని కృష్ణయ్య, తోట వీరభద్రం, తేజావత్‌ పంతులు తదితర నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు...

పోలీసుల దౌర్జన్యం సరికాదు

తమ కార్యర్తలను అరెస్టు చేశారని తెలిసి విడిచిపెట్టాలని పోలీస్‌లతో మాట్లాడాలని వెళితే వారు సరిగా స్పందించకపోవడంతో నిరసన వ్యక్తం చేశామని నాయకులు తమ్మినేని కృష్ణయ్య, జొన్నలగడ్డ రవి తదితరులు పేర్కోన్నారు. పద్ధతిగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేసి కొట్టారని వారు ఆరోపించారు. మహిళలను కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకుల మాటలు విని నిజా నిజాలు తెలుసుకోకుండా తమపై ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు

Read more