న్యూజిలాండ్‌ సిరీస్‌కు త్రిష

ABN , First Publish Date - 2022-11-21T00:09:16+05:30 IST

ఉమ్మడి ఖమ్మం క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి బీజం పడింది. భారత మహిళ క్రికెట్‌ అండర్‌-19 జట్టులో భద్రాచలానికి చెందిన గొంగడి త్రిషకు చోటు దక్కింది.

 న్యూజిలాండ్‌ సిరీస్‌కు త్రిష

మన్యం నుంచి జాతీయ స్థాయికి భద్రాద్రి యువకెరటం

అండర్‌-19 జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపిక

భద్రాచలం, నవంబరు 20: ఉమ్మడి ఖమ్మం క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి బీజం పడింది. భారత మహిళ క్రికెట్‌ అండర్‌-19 జట్టులో భద్రాచలానికి చెందిన గొంగడి త్రిషకు చోటు దక్కింది. ఈ నెల 27వ తేదీ నుంచి డిసెంబరు 6 వరకు ముంబైలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీ్‌సకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి త్రిషను ఎంపిక చేసింది. ఎనిమిదేళ్ల వయస్సులోనే అండర్‌-16లో రాణించిన త్రిష ఆ తర్వాత 12ఏళ్ల వయస్సులో రాష్ట్ర అండర్‌-19జట్టులో ఆడింది. అలాగే బీసీసీఐ ప్లేయర్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డును గెలుచుకుంది. త్రిష లెగ్‌ స్పిన బౌలింగ్‌ వేయడంతో పాటు బ్యాటింగ్‌లో కూడా రాణిస్తోంది.

తండ్రి చిరకాల స్వప్నం

స్వతహాగా పీఈటీగా, ఫిజికల్‌ ట్రైనర్‌గా పని చేస్తున్న జి.రామిరెడ్డి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో తన కూతురు త్రిషకు మూడేళ్ల ప్రాయంలో క్రికెట్‌ బ్యాట్‌, బాలు చేతికిచ్చారు. ఆరంభంలో ప్రతి రోజు ఆరు గంటల పాటు క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంది. లక్ష్య సాధనలో భాగంగా తండ్రి రామిరెడ్డి తన కూతురికి శాస్త్రీయ శిక్షణ కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. గతంలో దేశవ్యాప్తంగా 550 మంది యువ మహిళ క్రికెటర్లను గుర్తించి అందులో 39 మందిని మూడు జట్లకు ఎంపిక చేయగా అందులో త్రిష ఇండియా బ్లూ జట్టుకు ఎంపికవడం విశేషం. ఆరంభంలో భద్రాచలంలో సీనియర్‌ క్రికెటర్లుబుజ్జి, సుబ్రహ్మణ్యం కోచగా వ్యవహరించారు. నాల్గో తరగతి వరకు భద్రాచలంలో త్రిష చదువుకోగా అనంతరం హైదరాబాద్‌లోవివిధ కోచల వద్ద శిక్షణ పొందింది. ప్రస్తుతం త్రిష భారత జట్టు ఫీల్డింగ్‌ కోచగా ఇటీవల వరకు పని చేసిన ఆర్‌. శ్రీధర్‌ వద్ద శిక్షణ పొందుతోంది.

Updated Date - 2022-11-21T00:10:07+05:30 IST