నేడు ఖమ్మం జిల్లాకు వ్యవసాయశాఖ మంత్రి

ABN , First Publish Date - 2022-11-24T23:47:55+05:30 IST

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజనరెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి వేర్‌హౌజింగ్‌ కార్పొరేషన ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలం జింకలతండాలో రూ.14.90కోట్లతో నిర్మించిన 20వేలమెట్రిక్‌టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను ప్రారంభించనున్నారు.

నేడు ఖమ్మం జిల్లాకు వ్యవసాయశాఖ మంత్రి
రఘునాఽథపాలెం మండలం జింకలతండాలో నిర్మించిన గోదాములు ఇవే

పువ్వాడ అజయ్‌తో కలిసి రఘునాథపాలెంలో గోదాంలను ప్రారంభించనున్న నిరంజన్‌రెడ్డి

ఖమ్మం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజనరెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి వేర్‌హౌజింగ్‌ కార్పొరేషన ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలం జింకలతండాలో రూ.14.90కోట్లతో నిర్మించిన 20వేలమెట్రిక్‌టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 11గంటలకు జింకలతండాలో గోదాముల ప్రారంభించిన అనంతరం అక్కడ జరిగే సభలో పాల్గొని అనంతరం హైదరాబాద్‌ పయనమవుతారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో ఐదెకరాల స్థలంలో నిర్మించిన ఈ గోదాముల్లో స్థానిక రైతులు గిట్టుబాటు ధర వచ్చేవరకు తమ పంటలను నిల్వ చేసుకునే అవకాశం దక్కనుంది.

Updated Date - 2022-11-24T23:48:10+05:30 IST

Read more