దాతల సహకారంతోనే నేపాల్‌కు

ABN , First Publish Date - 2022-01-03T06:28:33+05:30 IST

నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో కామేపల్లి మండలంలోని హరిచ్చాంద్రపురం గ్రామానికి చెందిన గిరిజన ఆణిముత్యం లకావత్‌ స్వప్న గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

దాతల సహకారంతోనే నేపాల్‌కు

కామేపల్లి, జనవరి 2: నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో కామేపల్లి మండలంలోని హరిచ్చాంద్రపురం గ్రామానికి చెందిన గిరిజన ఆణిముత్యం లకావత్‌ స్వప్న గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఇటివల నేపాల్‌కు వెళ్ళడానికి ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆంధ్రజ్యోతిలో ‘అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు ఆర్ధిక అడ్డంకి’ అనే శీర్షికతో వార్తా కథనం ప్రచురణ అయిన విషయం విదితమే. ఆ కథనాన్ని చూసి కొంత మంది స్వప్నకు ఆర్ధిక సహయం చేశారు. ఆ సహయంతోనే ఆమె నేపాల్‌కు వెళ్లి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఈ సందర్భంగా ఆమెకు ఎంపీటీసీ లక్ష్మయ్య, జడ్పీటీసీ వెంకట ప్రవీన్‌కుమార్‌, సర్పంచ్‌ రామారావు అభినందనలు తెలిపారు. 

Read more