యవత స్వయంఉపాధి పథకాలతో ముందుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-02-20T05:15:31+05:30 IST

యవత స్వయం ఉపాధి పథకాలతో ముందుకెళ్లాలని నూతనంగా ఏర్పాటుచేయబోయే పరిశ్రమ, సర్వీసు యూనిట్లు ఏర్పాటుచేయడానికి యువతకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేయాలని ఎంఎస్‌ఎంఈ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శివరాంప్రసాద్‌ అన్నారు. శనివారం ప్రధానమంత్రి ఉ

యవత స్వయంఉపాధి పథకాలతో ముందుకెళ్లాలి

ఖమ్మం ఖానాపురంహవేలి, ఫిబ్రవరి 19: యవత స్వయం ఉపాధి పథకాలతో ముందుకెళ్లాలని నూతనంగా ఏర్పాటుచేయబోయే పరిశ్రమ, సర్వీసు యూనిట్లు ఏర్పాటుచేయడానికి యువతకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేయాలని ఎంఎస్‌ఎంఈ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శివరాంప్రసాద్‌ అన్నారు. శనివారం ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకంపై నగరంలోని టీటీడీసీ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి జిల్లాపరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ అజయ్‌కుమార్‌, ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎనఆర్‌ కళాశాల ఈడీపీ డాక్టర్‌ సత్యావతి, డైరెక్టర్‌ శివరాంప్రసాద్‌ హాజరై మాట్లాడారు. యవత పరిశ్రమల స్థాపనలో స్థలఎన్నిక, బ్యాంకు మంజూరులో మెళకువలతో పాటు మార్కెటింగ్‌ విషయాలపై పూర్తి అవగాహనతోపాటు ఎంపిక చేసుకున్న యూనిట్ల ప్రాజెక్టు రిపోర్టులు ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. విద్యార్థులు డిగ్రీ చివరి ఏడాదిఉండగానే ఇండస్ర్టీ సర్వీసు, బిజినెస్‌ సెక్టార్లపై అవగాహన కలిపించడంలో ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎనఆర్‌ డిగ్రీ కళాశాల ప్రథమస్థానంలో ఉందన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌ మీనాక్షి, పారిశ్రామికవేత్తలు, యువత పాల్గొన్నారు. Read more