పోడు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ద్వంద్వ వైఖరి

ABN , First Publish Date - 2022-11-30T00:14:09+05:30 IST

పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వ్యహరిస్తోందని, ప్రజలు, రాష్ట్రాల మధ్య యుద్ధానికి ప్రేరణ కలిగించేలా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. ఇటీవల గొత్తికోయల చేతిలో హతమైన చండ్రుగొండ రేంజర్‌ చలమల శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

పోడు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ద్వంద్వ వైఖరి
శ్రీనివాసరావు కుటుంబంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘునంధనరావు

కేంద్రం దృష్టికి శ్రీనివాసరావు హత్య అంశం

రేంజర్‌ కుటుంబానికి బీజేపీ నేత రఘునందన్‌రావు పరామర్శ

రఘునాథపాలెం, నవంబరు29: పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వ్యహరిస్తోందని, ప్రజలు, రాష్ట్రాల మధ్య యుద్ధానికి ప్రేరణ కలిగించేలా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. ఇటీవల గొత్తికోయల చేతిలో హతమైన చండ్రుగొండ రేంజర్‌ చలమల శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు ఊళ్లలోకి వస్తే కట్టేసి కొట్టాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బహిరంగంగానే పిలుపున్విడం వల్లే శ్రీనివాసరావు హత్య జరిగిందని ఆరోపించారు. అలా పిలుపునిచ్చిన ఎమ్మెల్యేను ఈ కేసులో మొదటి ముద్దాయిగా నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, శ్రీనివాసరావు హత్య విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఆయన కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. అధికార పార్టీ వారి మాటలే ఈ ఘటనకు కారణమని, పైగా గొత్తికోయలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాని మంత్రులు బాధ్యతరహితంగా ప్రకటనలు చేయడం ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టడమేనన్నారు. 15రోజుల్లో పోడు సమస్య పరిష్కరిస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ఆమాటే మరిచారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోడుభూములకు గణాంకాలు లేవన్నారు. ఆయన వెంట బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు, కాంపాటి వెంకన్న, పొట్లపల్లి నాగేశ్వరరావు, రుద్రప్రదీప్‌, దేవకి వాసుదేవరావు, కోటి వీరమోహనరెడ్డి, వల్లభనేని పుల్లయ్య, తమ్మెర రజిని, సుజాత, నాగమణి, తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-11-30T00:14:11+05:30 IST