వచ్చే జాతీయ లోక్‌అదాలత్‌లోనూ ఇదేస్ఫూర్తి కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-07-08T04:04:04+05:30 IST

గత జాతీయ లోక్‌అదాలత్‌లో పబ్టిక్‌ ప్రాసిక్యూటర్లు, పోలీసు అఽధికారులు విశేష కృషిచేసి ఖమ్మాన్ని అగ్రస్థానంలో నిలిపారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ టి.శ్రీనివాసరావు అన్నారు.

వచ్చే జాతీయ లోక్‌అదాలత్‌లోనూ ఇదేస్ఫూర్తి కొనసాగించాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు

ఖమ్మంలీగల్‌ జూలై 7: గత జాతీయ లోక్‌అదాలత్‌లో పబ్టిక్‌ ప్రాసిక్యూటర్లు, పోలీసు అఽధికారులు విశేష కృషిచేసి ఖమ్మాన్ని అగ్రస్థానంలో నిలిపారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ టి.శ్రీనివాసరావు అన్నారు. గురువారం న్యాయసేవాసదన్‌లో న్యాయమూర్తి పోలీసు అధికారులకు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు, ట్రాన్స్‌కో పోలీసులకు ప్రశంసా పత్రాలను అందించారు. గతలోక్‌ అదాలత్‌లో స్ఫూర్తితో వచ్చే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. న్యాయసేవాసంస్థ కార్యదర్శి మహ్మద్‌ అబ్దుల్‌ జావీద్‌పాషా మాట్లాడుతూ చిన్న చిన్నకేసులను రాజీమార్గంలో పరిష్కరించు కోవాలని చెప్పారు. తద్వారా పెద్ద కేసులపై కోర్టులు దృష్టిపెట్టడానికి ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం అదనపు పోలీసు కమిషనర్‌ శబరీష్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు బి.కృష్ణ మోహనరావు, వి.నర్సయ్య, అనిల్‌కుమార్‌, నాగలక్ష్మీ, ఖమ్మం డివిజన్‌ పోలీసు అధికారులను, సిబ్బందిని న్యాయమూర్తి సన్మానించారు. 

 

Read more