తగ్గి పెరుగుతున్న గోదావరి

ABN , First Publish Date - 2022-09-17T05:57:22+05:30 IST

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గి పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 5 గంటలకు 40.2అడుగులున్న నీటిమట్టం అనంతరం ఏడు గంటల పాటు నిలకడగా

తగ్గి పెరుగుతున్న గోదావరి

 భద్రాచలం వద్ద ఏడు గంటలపాటు నిలకడగా

భద్రాచలం, సెప్టెంబరు 16 : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గి పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 5 గంటలకు 40.2అడుగులున్న నీటిమట్టం అనంతరం ఏడు గంటల పాటు నిలకడగా ఉంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్వల్పంగా పెరుగుతూ సాయంత్రం 3 గంటలకు 40.4, ఆరు గంటలకు 40.5అడుగులకు చేరింది. మరో రెండు అడుగులలోపు వరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహకంలో ఎగువన పడిన వర్షాలతో గోదావరి స్వల్పంగా పెరిగిందని చెబుతున్నారు. 


Read more