కత్తిదాడి ఘటనలో చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-31T05:27:51+05:30 IST

అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

కత్తిదాడి ఘటనలో చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

సంఘటన స్థలాన్ని పరిశిలించిన ఖమ్మం ఏసీపీ 

 పరారీలో నిందితుడు 

ఖమ్మం క్రైం, మే 30: అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జూన్‌ 9 వివాహం కానున్న యువకుడు తన పెళ్లి కార్డు ఇచ్చేందుకు మహిళ ఇంటికి వెళ్లగా అది చూసిన మహిళ భర్త తట్టుకోలేక కత్తితో విచిక్షణా రహితంగా దాడి చేశాడు. ఆదివారం రాత్రి ఖమ్మం నగర శివారులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఖానాపురంహవేలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగర పరిధిలోని అల్లిపురానికి చెందిన సంపంగి వీరబాబుకు వైరా మండలానికి చెందిన ఓ మహిళతో కొన్ని సంవత్సారాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. అయితే విరిద్దరి మధ్య విబేధాలు రావడంతో కొతకాలంగా సదరు మహిళ నగర శివారులోని గోపాలపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఈక్రమంలో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్‌ విధులు నిర్వహిస్తున్న అల్లీపురానికి చెందిన నల్లగట్ల నవీన్‌ (24)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దాంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని భర్త వీరబాబు అనుమానించాడు. ఈ క్రమంలో వీరబాబుకు నవీన్‌కు మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయినా వారు సన్నిహితంగా ఉంటుండటంతో వీరబాబు తట్టుకోలేకపోయాడు.  ఈ క్రమంలో ఇటీవలే నవీన్‌కు పెళ్లి నిశ్చితార్ధం జరిగింది. జూన్‌ 9న వివాహం జరగనుంది. దాంతో పెళ్లి కార్డు ఇచ్చేందుకు నవీన్‌ అదివారం రాత్రి సదరు మహిళ ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న భర్త వీరబాబు అక్కడ కాపుకాసి వారు సరదాగా మాట్లాడటం చూసి ఒక్కసారిగా కత్తితో నవీన్‌పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. వీర బాబాను అడు ్డకునేం దుకు ప్రయ త్నించిన మహిళ పై కూడా అత డు దాడి చేశాడు. ఈ దాడిలో నవీన్‌ చా తి, వీపు, చేతులపై గాయా లు కాగా వెంటనే అతడిని సదరు మహిళ ఆటోలో ఎక్కించుకొంని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రి వారు జాయిన్‌ చేసుకోకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. వెంటనే వైద్యులు చికిత్స అందిస్తుండగా అర్ధరాత్రి సమయంలో నవీన్‌ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఖానాపురం హవేలీ సీఐ రామక్రిష్ణ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి నవీన్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నవీన్‌ను హత్య చేసిన వీరబాబును కఠినంగా శిక్షించాలని అతడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం ఉదయం నగర ఏసీపీ ఆంజనేయులు, సీఐ రాయక్రిష్ణ సంఘటన జరిగిన మహిళ ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు వీరబాబు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-05-31T05:27:51+05:30 IST