వ్యవసాయాన్ని పండుగ చేసే బాధ్యత కాంగ్రెస్‌దే

ABN , First Publish Date - 2022-05-31T05:29:27+05:30 IST

వ్యవసాయాన్ని పండుగల మార్చే భాద్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వే్‌షరెడ్డి పేర్కొన్నారు.

వ్యవసాయాన్ని పండుగ చేసే బాధ్యత కాంగ్రెస్‌దే
పుల్లయ్యబంజరులో ప్రసంగిస్తున్న సంబాని

 కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంబాని

చింతకాని/కల్లూరు, మే 30: వ్యవసాయాన్ని పండుగల మార్చే భాద్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వే్‌షరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో మండల కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కొప్పుల గోవిందరావు అధ్యక్షతన నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీ ఇటీవల ప్రవేశ పెట్టిన రైతు డిక్లరేషన్‌ గురించి వివరించారు. పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫి అమలు చేస్తామని, కౌలు రైతులకు ఇందిరమ్మ రైతుభరోసా ద్వారా రూ.15 వేలు ఇస్తామాన్నరు. వ్యవసాయరంగం అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు మొ క్కా శేఖర్‌గౌడ్‌, మండల అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, నాయకులు కూరపాటి కిషోర్‌, బొర్రా ప్రసాద్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బందెల నాగార్జున, సట్టు వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ నారపోగు కొండల్‌రావు, తూము అంజయ్య, గాదె అంజయ్య, తూము కోటేశ్వరరావు, పాల్గొన్నారు. 


కార్పొరేట్‌కు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాలు


కల్లూరు: ప్రభుత్వ రంగ సంస్టలను ప్రైవేట్‌ పరం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్‌ శక్తులకు వత్తాసు పలుకుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షడు సంబాని చంద్రశేఖర్‌ విమర్శించారు. మండలంలోని పుల్లయ్యబంజరు, తూర్పు, పడమట లోకవరం, పాయపూర్‌, ముచ్చవరం, ఎర్రబోయినపల్లి, వాచ్యానాయక్‌తాండ గ్రామాల్లో సోమవారం కాంగ్రెప్‌ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబాని ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా పేదలకు పంపిణీ చేసిన భూములను కేసీఆర్‌ ప్రభుత్వం వెనక్కులాక్కొని రియల్‌ దందా వ్యాపారం సాగిస్తుందని విమర్శించారు. తమ ప్రభ్వుతం అధికారంలోకి రాగానే పేదలకు పంచిన భూములను తిరిగి వారికే అందంచటమే కాకుండా పోడు, అస్సైన్డ్‌ భూములకు హక్కులు కల్పించి, క్రయ,విక్రయాలు జరిగేలా వెసులుబాటు కల్పింస్తామని చెప్పారు. రైతు, రైతుకూలీ రాజ్యం అధికారంలోకి వచ్చేలా కాంగ్రెస్‌ పార్టీని రానున ్న ఎన్నికల్లో ప్రజలు ఆశ్వీర్వాదించాలని కోరారు. వరంగల్‌లో రైతు డిక్లేరేషన్‌ లో తీర్మానించిన రైతు సంక్షేమ కార్యాక్రమాలను కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తప్పకుండా అమలు పరుస్తామని సంబాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్‌, ఆ పార్టీ నాయకులు బి మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీ కొండూరి కిరణ్‌కుమార్‌, తోట జనార్ధన్‌, జిల్లేళ్ల కృష్ణారెడ్డి, ఇజ్జగాని సత్యం, బొడ్డు కృష్ణ, అఫ్రోజ్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more