క్షతగాత్రులను చూస్తుండగా బైక్‌ ఢీ..

ABN , First Publish Date - 2022-07-08T04:04:51+05:30 IST

రోడ్డుప్రమాదంలో గాయపడిన దంపతులను అటుగా వెళుతున్న ఓ ఇద్దరు చూస్తున్నారు.. వీరిని మరో ద్విచక్ర వాహనం ఢీ కొట్టటంతో వారు గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం..

క్షతగాత్రులను చూస్తుండగా బైక్‌ ఢీ..

ఒకరి పరిస్థితి విషమం, మొత్తంగా ఐదుగురికి గాయాలు

కామేపల్లి, జులై7: రోడ్డుప్రమాదంలో గాయపడిన దంపతులను అటుగా వెళుతున్న ఓ ఇద్దరు చూస్తున్నారు.. వీరిని మరో ద్విచక్ర వాహనం ఢీ కొట్టటంతో వారు గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. పండితాపురం గ్రామానికి చెందిన అంబడిపుడి మల్లికార్జున్‌, నాగలక్ష్మి పొలం పనులు ముగించుకొని వస్తున్నారు. ముచ్చర్ల మొయిన్‌రోడ్‌ వద్ద బైక్‌పై క్రాస్‌ చేస్తున్న క్రమంలో కామేపల్లి గ్రామీణ బ్యాంక్‌లో ఉద్యోగ విధులు ముగించుకొని ఖమ్మం వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు వీరిని ఢీ కొట్టాడు. ఆ దంపతులకు తీవ్రగాయలు అయ్యాయి. అక్కడ గాయపడిన వారిని పండితాపురానికి చెందిన కొమ్మినేని నగేష్‌, పోతనబోయిన వెంకన్న వారిని చూస్తుండగా, మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న తుటికుంట్లకు చెందిన వ్యక్తి ఒక్కసారిగా ఇద్దరిని ఢీ కొట్టాడు. ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఢీకొట్టిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన ఐదుగురిని ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Read more