సంప్రదాయానికి ప్రతీక తీజ్‌

ABN , First Publish Date - 2022-08-15T08:27:37+05:30 IST

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అన్నారు. దాసుతండాలో ఆదివారం నిర్వహించిన తీజ్‌ వేడుకల్లో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు.

సంప్రదాయానికి ప్రతీక తీజ్‌
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌

టేకులపల్లి, ఆగస్టు 14: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అన్నారు. దాసుతండాలో ఆదివారం నిర్వహించిన తీజ్‌ వేడుకల్లో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన యువతులు, మహిళలు భక్తిశ్రద్ధలతో తీజ్‌ పండుగ జరుపుకుంటారన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్‌ ఉత్సవాలల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనాదిగా వస్తున్న ఆచారాలు, సం ప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో టేకులపల్లి సీఐ ఎ.వెంకటేశ్వరరావు, ఎస్సై బి.శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బి.వరప్రసాద్‌, నాయకులు బాలు, రామా, పుల్‌సింగ్‌ పాల్గొన్నారు.

Read more