రాష్ట్రస్థాయి పోటీలకు స్విమ్మర్స్‌ ఎంపిక

ABN , First Publish Date - 2022-11-25T00:07:43+05:30 IST

సింగరేణి సీఈఆర్‌ క్లబ్‌లో జిల్లాస్థాయి స్విమ్మర్స్‌ పోటీలను గురువారం నిర్వహిం చారు.

రాష్ట్రస్థాయి పోటీలకు స్విమ్మర్స్‌ ఎంపిక
స్విమ్మింగ్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

రుద్రంపూర్‌, (సింగరేణి) నవంబరు 24 : సింగరేణి సీఈఆర్‌ క్లబ్‌లో జిల్లాస్థాయి స్విమ్మర్స్‌ పోటీలను గురువారం నిర్వహిం చారు. జిల్లాస్థాయిలో పోటీలో పాల్గొన్న స్విమ్మర్లను ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే పోటీలకు ఎంపిక చేసినట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్వీమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి హనుమంతురాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో స్వీమ్మింగ్‌లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని తెలిపారు. విద్యార్థులు ప్రాఽథమిక దశ నుంచే స్విమ్మింగ్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన స్విమ్మర్లను అసోసియేషన్‌ ప్రతినిధులు నర్సింహారెడ్డి, కొండలరావు, రెడ్డినాజుల నరహరి, స్విమ్మర్లు సామేల్‌, సంధ్యలు అభినందించారు. అక్కడ కూడా ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

Updated Date - 2022-11-25T00:07:43+05:30 IST

Read more