స్వచ్ఛపక్వాడ్‌ను విజయవంతం చేయాలి..

ABN , First Publish Date - 2022-06-08T05:27:56+05:30 IST

18న నిర్వహించే స్వచ్ఛపక్వాడ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి హెచ్‌ఆర్‌డీ జనరల్‌ మేనేజరు బీహెచ్‌. వెంకటేశ్వరరావు కోరారు.

స్వచ్ఛపక్వాడ్‌ను విజయవంతం చేయాలి..
సమావేశంలో మాట్లాడుతున్న జీఎం హెచ్‌ఆర్‌డీ వెంకటేశ్వరరావు

సింగరేణి జీఎం వెంకటేశ్వరరావు 

రుద్రంపూర్‌, (సింగరేణి), జూన్‌ 7: 18న నిర్వహించే స్వచ్ఛపక్వాడ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి హెచ్‌ఆర్‌డీ జనరల్‌ మేనేజరు బీహెచ్‌. వెంకటేశ్వరరావు కోరారు. మంగళవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో స్వచ్చపక్వాడ్‌పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్పోరేట్‌ ఏరియాను స్వచ్ఛపక్వాడ్‌లో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జీఎం ఎడ్యూకేషనల్‌ పద్మనాగరెడ్డి, డీజీఎం పర్సనల్‌ శ్రీనివాస్‌, డీవైసీఎంవో సునీల్‌, ఈఅండ్‌ఎం డీజీఎం రాజీవ్‌కు మార్‌, సివిల్‌ డీజీఎం రాజశేఖర్‌, మేనేజరు ఫజల్‌ రెహమాన్‌, అధికారులు బేతిరాజు, వెంకటేశ్వరావు, సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Read more