కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి

ABN , First Publish Date - 2022-09-18T04:57:31+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ రైతులు ప్రారంభించిన పాద యాత్రకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికావని కాంగ్రెస్‌ జిల్లా నాయకులు, కొణిజర్ల సర్పంచ్‌ సూరంపల్లి రామారావు అన్నారు.

కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి
మాట్లాడుతున్న సూరంపల్లి రామారావు

రేణుకా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం

విలేకరుల సమావేశంలో సూరంపల్లి రామారావు ధ్వజం

కొణిజర్ల, సెప్టెంబరు 17: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ రైతులు ప్రారంభించిన పాద యాత్రకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికావని కాంగ్రెస్‌ జిల్లా నాయకులు, కొణిజర్ల సర్పంచ్‌ సూరంపల్లి రామారావు అన్నారు. శనివా రం ఆయన కొణిజర్లలో మాట్లాడారు. రేణుకాచౌదరిపై విమర్శలు చేస్తే సహించమన్నారు. గతంలో రేణుకా చౌదరి మాజీ మంత్రిగా పని చేసిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించారన్నారు. రేణుకాచౌదరి ఖమ్మం కార్పొరేటర్‌గా కూడా గెలుపొందదని అసెంబ్లీ సాక్షిగా విమర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం నుంచి భారీ మెజార్టీతో రేణుకాచౌదరిని గెలిపించి కేంద్రమంత్రి చేస్తామని, దమ్ముంటే వచ్చి అడ్డుకోమని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో సొసైటీ వైస్‌చైర్మన్‌ రమేష్‌, కొణిజర్ల ఎంపీటీసీ స్వర్ణలత, లాలయ్య పాల్గొన్నారు. 

Read more