కొనుగోలు కేంద్రాలతో మద్దతు ధర

ABN , First Publish Date - 2022-11-18T23:48:08+05:30 IST

: రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలని, ఖమ్మం జిల్లాలో మొత్తం 220 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇందులో పైనంపల్లి లో తొలి కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వా

కొనుగోలు కేంద్రాలతో మద్దతు ధర
పైనంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

కొనుగోలు కేంద్రాలతో మద్దతు ధర

8 ధాన్యం సేకరణకు జిల్లాలో మొత్తం 220సెంటర్ల ఏర్పాటు

జిల్లాలో మొదటి కేంద్రం పైనంపల్లిదే

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

నేలకొండపల్లి, నవంబరు 18: రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలని, ఖమ్మం జిల్లాలో మొత్తం 220 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇందులో పైనంపల్లి లో తొలి కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం పైనంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనం తరం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లా డారు. పెరిగిన వనరుల దృష్ట్యా కరోనా సమయం లో సైతం మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందన్నారు. కొనుగోలులో, చెల్లింపుల్లో రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. గతంలో ధాన్యాన్ని బయటి జిల్లాలకు పంపేవారమని, కానీ ప్రస్తుతం స్థానిక

రైతులు పండించిన ధాన్యాన్ని స్థానిక మిల్లులకే పంపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు. గతంలో ధాన్యం కొనుగోలుకు యుద్ధమే చేయాల్సి వచ్చేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ధాన్యం కొనుగోళ్లలో సహకరించకుండా, ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాలేరు నియోజకవర్గంలో పండిన ధాన్యాన్ని స్థానిక మిల్లులకే కేటాయించాలని కలెక్టర్‌ను కోరానని, అందుకు కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ గౌతమ్‌ మాట్లాడుతూ ధాన్యం వచ్చేవరకు వేచి చూడకుండా ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో కోటి గన్నీ బ్యాగులు అవసరమని, ప్రస్తుతం 60లక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ

కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, జేసీ మధుసూధన్‌, సొసైటీ అధ్యక్షుడు నాగుబండి శ్రీనివాసరావు, జడ్పీ ఉపాధ్యక్షురాలు మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, తహసీల్దార్‌ దారా ప్రసాద్‌, రైతుబంధు మండల కన్వీనర్‌ శాఖమూరి సతీష్‌, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన చైర్మన్‌ నంబూరి శాంత, ఎంపీటీసీ సభ్యుడు ఉసిరికాయల లక్ష్మయ్య, అనగాని నర్శింహారావు, కోటి శ్రీనివాసరావు, దండా పుల్లయ్య, ఉన్నం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

నాలుగు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

శుక్రవారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యే కందాళ ప్రారంభించారు. తొలుత పైనంపల్లిలో ఽసొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించగా, చెర్వుమాధారం, బోదులబండల్లో సొసైటీల ఆధ్వర్యంలోనూ, నేలకొండపల్లిలో వ్యవసాయ మార్కెట్‌ ఆధ్వర్యంలోనూ, చెర్వుమాధారంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రారంభించారు. మంత్రి పైనంపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ జిల్లాలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రం పైనంపల్లిలోనే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇంతకు ముందుగానే మండ్రాజుపల్లి, రాజేశ్వరపురం గ్రామాల్లో సొసైటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన విషయం మరి అధికారులు మర్చిపోయారేమో మరి. ఈ కార్యక్రమాల్లో సొసైటీల అధ్యక్షులు పగిడిపత్తి శ్రీను, అనంతు కాశయ్య, నాగుబండి శ్రీనివాసరావు, మార్కెట్‌ చైర్మన్‌ నంబూరి శాంత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, జడ్పీ ఉపాధ్యక్షురాలు మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, ఎంపీటీసీ ఉసిరికాయల లక్ష్మయ్య, సర్పంచ్‌లు కోండ్రు విజయలక్ష్మి, అనగాని అనిత, ఈవూరి సుజాత, సీఈఓలు జగదీష్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T23:48:11+05:30 IST