ఉద్యోగం రానందునే ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-04T05:28:31+05:30 IST

బీటెక్‌ పూర్తిచేసి మూడేళ్లయినా ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది తమ కుమారుడు యడపల్లి రామ్‌గోపాల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డా డని అతడి తల్లి శ్రీలక్ష్మి తెలిపింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ఎన్టీఆర్‌నగర్‌ సమీపంలోని వరిపొలంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో రామ్‌గోపాల్‌ బైక్‌తో సహా దహనమైన

ఉద్యోగం రానందునే ఆత్మహత్య

 రామ్‌గోపాల్‌ తల్లి శ్రీలక్ష్మి ఫిర్యాదు

 ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఘటన

తల్లాడ, జనవరి 3: బీటెక్‌ పూర్తిచేసి మూడేళ్లయినా ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది తమ కుమారుడు యడపల్లి రామ్‌గోపాల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డా డని అతడి తల్లి శ్రీలక్ష్మి తెలిపింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ఎన్టీఆర్‌నగర్‌ సమీపంలోని వరిపొలంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో రామ్‌గోపాల్‌ బైక్‌తో సహా దహనమైన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఖమ్మం జిల్లా తల్లాడ పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం 2019లో సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రామ్‌గోపాల్‌ బీటెక్‌ పూర్తిచేశాడు. అప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయినా ఉద్యోగం రాలేదు. ఈ క్రమంలో మూడురోజుల నుంచి మనోవేదనతో ఉన్న రామ్‌గోపాల్‌కు తాము సర్దిచెప్పినట్లు తల్లి శ్రీలక్ష్మి తెలిపింది. రెండోతేదీ ఉదయం తాము కూలీపనికి వెళ్లగా ఇంట్లో ఉన్న బైక్‌పై రామ్‌గోపాల్‌ కోదాడ నుంచి తల్లాడ చేరుకొని ఎన్టీఆర్‌నగర్‌ సమీపంలోని దేవభక్తిని సత్యనారాయణ అనే రైతు పొలంలో మద్యం తాగి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. సోమవారం సంఘటనా స్థలాన్ని వైరా సీఐ జె.వసంతకుమార్‌ సందర్శించి వివరాలు సేకరించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రామ్‌గోపాల్‌ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అతడి స్వస్థలమైన కోదాడ పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి తరలించారు.


Read more