సబ్‌సెంటర్లను ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-02-20T04:54:29+05:30 IST

జిల్లాలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన సబ్‌సెంటర్లను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి పంచాయతీరాజ్‌ పర్యవేక్షక ఇంజనీర్లతో కలిసి జిల్లాలోని డిప్యూటీ ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహిం చారు.

సబ్‌సెంటర్లను ప్రారంభించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌

 వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మంకలెక్టరేట్‌, ఫిబ్రవరి19: జిల్లాలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన సబ్‌సెంటర్లను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి పంచాయతీరాజ్‌ పర్యవేక్షక ఇంజనీర్లతో కలిసి జిల్లాలోని డిప్యూటీ ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహిం చారు. జిల్లాలో సబ్‌సెంటర్ల నిర్మాణం సీసీ రోడ్ల పనుల పురోగతిని సమీక్షించారు. జిల్లాలో రూ.4కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 25 సబ్‌సెంటర్ల భవన నిర్మాణాల పనులను చేపట్టామని వాటిలో ఇప్పటి వరకు 11   పూర్తయ్యాయని చెప్పారు. ఈ భవనాలను వైద్య శాఖాధికారులకు అప్పగించి వినియోగంలోకి తీసుకురా వాలన్నారు. మరో 9 సబ్‌సెంటర్లు చివరి దశలో ఉన్నాయని వీటిని తక్షణమే పూర్తి చేయాలన్నారు. రూ.18.96 కోట్లతో 426 సీసీ రోడ్ల పనులు చేపట్టామని వీటిలో ఇప్పటి వరకు రెండు వందలకు పైగా సీసీరోడ్ల పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను మార్చి 10లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. నాణ్యతాప్రమాణాతో కూడిన పనులు చేపట్టాలని అసిస్టెంట్‌ ఈఈల సమక్షంలోనే పనులు జరగాలన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు పనులను తరచుగా పర్యవేక్షింస్తూ నిర్ధేశించిన సమయం లోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఇంజనీరింగ్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ గజం సీతారాములు, ఇన్‌చార్జి ఈఈ కెవీకె శ్రీనివాస్‌, డిప్యూటీ ఈఈలు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు. 

Read more