భద్రాద్రిలో ముగిసిన అధ్యయనోత్సవాలు

ABN , First Publish Date - 2022-01-24T05:23:45+05:30 IST

భద్రాద్రిలో ముగిసిన అధ్యయనోత్సవాలు

భద్రాద్రిలో ముగిసిన అధ్యయనోత్సవాలు
రాపత్తు సేవ నిర్వహిస్తున్న దృశ్యం

నేటినుంచి విలాసోత్సవాలు 

వనవిహార మండపం వారి ఆధ్వర్యంలో రాపత్తుసేవ

భద్రాచలం, జనవరి 23: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాపత్తుసేవలు ఆదివారంతో ముగిశాయి. నేటినుంచి మూడు రోజుల పాటు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు. చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్న రాపత్తుసేవల్లో భాగంగా చివరిరోజు వనవిహార మండపంవారి ఆధ్వర్యంలో రాపత్తుసేవ నిర్వహించారు. ఆదివారం సందర్భంగా అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆర్జితసేవలో భాగంగా భక్తుల సమక్షంలో సువర్ణపుష్ప పూజ నిర్వహించారు. నిత్యకల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఐపీఎస్‌ అధికారి యోగేష్‌ గౌతమ్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.Read more