సోనియా, ప్రియాంక కోలుకోవాలని ప్రార్థనలు

ABN , First Publish Date - 2022-06-08T05:19:59+05:30 IST

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ భద్రాచలంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.

సోనియా, ప్రియాంక కోలుకోవాలని ప్రార్థనలు
భద్రాద్రి రామాలయంలో కాంగ్రెస్‌ నాయకులు

భద్రాచలం, జూన్‌ 7: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ భద్రాచలంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. భద్రాచలంలోని రామాఆలయం, సీఎస్సై చర్చి, మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు చింతిరేల రవికుమార్‌ మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, రంగారావు, రమేష్‌గౌడ్‌, తిరుపతిరావు, ప్రదీప్‌, రాగం సుధాకర్‌, సరెళ్ల వెంకటేష్‌, రాచమల్ల రాము, మగపు రాజు, చిట్టా రాజు, తరుణ్‌, గొర్ల రామకృష్ణ పాల్గొన్నారు.

Read more