కొత్తమేడేపల్లి గిరిజనుల సమస్యలను పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-11-17T01:14:28+05:30 IST

అటవీ ప్రాంతంలోని కొత్తమేడేపల్లికి చెందిన ఓ చిన్నారి ఇటీవల సకాలంలో వైద్యం అందక మృతిచెందడం, ఆమె మృతదేహాన్ని ఖమ్మం ఆసుపత్రి నుంచి గ్రామానికి వాహనంలో తీసుకొచ్చే స్థోమత లేక 60కిలోమీటర్లు బైక్‌పై తీసుకొచ్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై చలించిన ఏన్కూరు ఎంపీపీ ఆరెం వరలక్ష్మి.. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్న కొత్తమేడేపల్లి ఆదివాసుల దీనస్థితిని వివరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారం ఓ లేఖ రాశారు.

కొత్తమేడేపల్లి గిరిజనుల సమస్యలను పరిష్కరించండి
కొత్తమేడేపల్లి గ్రామం

02kmm16mpp-lettar.jpgఎంపీపీ ఆరెం వరలక్ష్మి

రాష్ట్రపతికి ఏన్కూరు ఎంపీపీ వరలక్ష్మి లేఖ

ఏన్కూరు, నవంబరు 16: అటవీ ప్రాంతంలోని కొత్తమేడేపల్లికి చెందిన ఓ చిన్నారి ఇటీవల సకాలంలో వైద్యం అందక మృతిచెందడం, ఆమె మృతదేహాన్ని ఖమ్మం ఆసుపత్రి నుంచి గ్రామానికి వాహనంలో తీసుకొచ్చే స్థోమత లేక 60కిలోమీటర్లు బైక్‌పై తీసుకొచ్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై చలించిన ఏన్కూరు ఎంపీపీ ఆరెం వరలక్ష్మి.. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్న కొత్తమేడేపల్లి ఆదివాసుల దీనస్థితిని వివరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారం ఓ లేఖ రాశారు. ఈ లేఖలో కొత్తమేడేపల్లితో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన గ్రామాల్లోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోనే తెలుగుదేశం తరుపున ఎంపీపీగా ఎన్నికైన ఏకైక మహిళ ఆరెం వరలక్ష్మి.. ఏన్కూరు ఎంపీపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. విద్యావంతురాలైన వరలక్ష్మి తన బాల్యంనుంచి చూసిన గిరిజన కష్టాలను వివరిస్తూ రాష్ట్రపతిగా ఉన్న గిరిజన మహిళకు లేఖ రాయడం ద్వారా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని భావించారు. ఈ మేరకు రెండు జిల్లాల్లోని గిరిజనుల ప్రధాన సమస్యలు, భూబదలాయింపు చట్టం, ఎల్‌టీఆర్‌ చట్టం, 1/70, పెసా, అటవీహక్కుల చట్టాల అమలుతీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల వినియోగం తదితర అంశాలను తన లేఖలో పేర్కొన్నారు. పాలకులు గిరిజన గ్రామాలను పట్టించుకోవడంలేదని, పేరుకు మాత్రమే చట్టాలున్నాయని, అవి పకడ్బందీగా అమలు కావడంలేదన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, రహదారి, విద్యుత సౌకర్యాలు లేక చీకట్లో మగ్గుతున్న గ్రామాలు నేటికీ ఉన్నాయని లేఖలో వివరించారు. వైద్యం అందక ఓ చిన్నారి మృతి చెందిన ఘటనతో కొత్తమేడేపల్లి గ్రామం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ గ్రామాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సందర్శించి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మీ ఇచ్చారు. గ్రామాన్ని పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు.

Updated Date - 2022-11-17T01:14:29+05:30 IST