సమైక్య వజ్రోత్సవాలు జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2022-09-11T05:06:33+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సమైక్య వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.

సమైక్య వజ్రోత్సవాలు జయప్రదం చేయాలి
ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి, సెప్టెంబరు 10: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సమైక్య వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కల్లూరు ఆర్టీవో అధ్యక్షతన జరిగిన వజ్రోత్సవాల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ సమాజం చేరి 75వసంతంలోకి అడుగిడుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించి కార్యక్రమాలు ప్రకటించారని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీన నియోజకవర్గ కేంద్రంలో 15వేల మందితో ర్యాలీ నిర్వహించనున్నామని, సత్తుపల్లి జేవీఆర్‌ డిగ్రీ కాలేజి నుంచి ప్రదర్శన బయలు దేరి సిద్దారం రోడ్డులో ఫంక్షన్‌ హాల్స్‌ వద్ద ముగుస్తుందని చెప్పారు. అక్కడే సభ జరుగు తుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ర్యాలీ విజయ వంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలతో పోలిస్తే సత్తుపల్లిలో వినూత్నంగా ర్యాలీ నిర్వహించేందుకు అవసరమైన సలహాలు ఇవ్వాలని కోరారు. కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ ర్యా లీ విజయవంతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు త మ శాఖ తరఫున ప్రణాళిక రూపొందించామని, వేలా సంఖ్యలో సత్తుపల్లికి వస్తున్న కారణంగా 16వ తేదీన ట్రాఫిక్‌ను కూడా మళిస్తామని చెప్పారు. ర్యాలీ, సభ అనంతరం భోజన ఏర్పాట్లు కూడా ఉన్న కారణంగా మండలాల వారీగా కౌంటర్లు ఉంటాయని ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ర్యాలీకి వచ్చే వారికి తెలియజెప్పాలని సూచించారు. ఇతర మండలాల నుంచి వచ్చే  వాహనాల పార్కింగుకు ప్రత్యేక స్థలం కేటాయిం చనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధు లు, ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల బాధ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అయిదు మండలాలకు చెందిన తహసీల్దార్‌లు, ఎంపీడీవో లు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 


Read more