ఇసుక.. దొడ్డిదారిన చకచకా

ABN , First Publish Date - 2022-03-05T04:17:23+05:30 IST

గోదారి, పెద్దవాగు పేరు ఏదయితేనేం.. భద్రాచలం, కరకగూడెం ప్రాంతం మారితేనేం.. అదే దందా, అదే పంథా! కళ్లముందు విస్తారంగా ఇసుక.. టిప్పర్‌, ట్రాక్టర్‌ దర్జాగా తరలిపోతోంది. కందకాలు తవ్వినా ఆగదు. అదో సమాంతర ఇసుకాసు రుల వ్యవస్థ. దీనికి తోడు అధికారుల సుప్తాచేతినావస్థ. అడ్డూఅదుపులేని తవ్వకాలతో పరిసర ప్రాంతాల దీనావస్థ!

ఇసుక.. దొడ్డిదారిన చకచకా
కరకగూడెంలోని పెద్దవాగులో ఇసుకను ట్రాక్టర్‌లో లోడ్‌ చేస్తున్న కూలీలు

గోదావరి, పెద్దవాగుల్లో అక్రమార్కుల తిష్ట

ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలింపు

రూ. లక్షల్లో ఆర్జిస్తున్న వైనం.. అడుగండుతున్న భూగర్భ జలాలు

నామమాత్రపు చర్యలకే రెవెన్యూ, పోలీసు శాఖలు పరిమితం

భద్రాచలం/ కరకగూడెం, మార్చి 4: గోదారి, పెద్దవాగు పేరు ఏదయితేనేం.. భద్రాచలం, కరకగూడెం ప్రాంతం మారితేనేం.. అదే దందా, అదే పంథా! కళ్లముందు విస్తారంగా ఇసుక.. టిప్పర్‌, ట్రాక్టర్‌ దర్జాగా తరలిపోతోంది. కందకాలు తవ్వినా ఆగదు. అదో సమాంతర ఇసుకాసు రుల వ్యవస్థ. దీనికి తోడు అధికారుల సుప్తాచేతినావస్థ. అడ్డూఅదుపులేని తవ్వకాలతో పరిసర ప్రాంతాల దీనావస్థ!

పగలు రెక్కీ.. రాత్రి రవాణా

ఇసుక అక్రమార్కులు దందాలో కొత్త పంథా అనుసరి స్తున్నారు. పగలు రెక్కీ నిర్వహిస్తూ భద్రాచలం పట్టణంలో దర్జాగా తిరుగుతూ రాత్రి వేళల్లో ముఠాలుగా ఏర్పడి  య థేచ్ఛగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. దర్జాగా వెనకేసుకుంటున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారుల పర్య వేక్షణాలోపం ఇసుక అక్రమార్కుల పాలిట వరంగా మారింది. దీంతో వారు పేట్రేగిపోతున్నారు. ఈనేపఽథ్యం లోనే గత ఆదివారం ఇసుక దందా బహిర్గతం కావడంతో ఇసు క అక్రమ తరలింపు వ్యవహారంలో 12 మంది ట్రాక్టర్‌ యజమానులు, మరో 16 మంది కూలీలపై భద్రాచలం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు ఇసుక ట్రాక్టర్‌ సీజ్‌ చేశారు. అయినప్పటికీ వారి తీరు మారలేదు.

కొల్లగూడెం ర్యాంపు నుంచి

భద్రాచలం శివారు ప్రాంతంలోని కొల్లుగూడెం ర్యాంపు నుంచి ఇటీవల కాలంలో కొందరు ఇసుక అక్రమార్కులు వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ములు గడిస్తున్నారు. దీంతో అధికారులు వారి ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు గోదావరీ నదీ పరిసర ప్రాంతాల్లో కందకాలను తవ్వారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్రమార్కులు ఇసుకను రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇసు కను భద్రాచలం పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలకు తర లిస్తూ ఒక్కో ట్రాక్టర్‌ ఇసుక లోడ్‌కు రూ 3,500 నుంచి రూ.5000 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేకాక ఆనధికారిక ర్యాంపుల నుంచి అనుమతులతో తెప్పిస్తున్నా మని వినియోగదారులకు చెప్పి టిప్పర్ల ద్వారా ఇసుక తెచ్చి డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి గట్టుచప్పుడు కా కుండా రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా అనుకున్న ప్రాంతా లకు సైతం ఇసుకకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల ర్యాంపు వద్ద కందకాలు తవ్వినా అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు. గోదావరి నదీ ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో ఇసుకను లారీల్లో లోడ్‌ చేస్తూ భద్రాచలానికి తరలించి, అ క్కడ నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక అమ్మకాలు జరుపు తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పలు ప్రాంతాల నుంచి అధికారికంగా రెండు మూడు బిల్లులను వెంట తెచ్చుకొని వాటి ముసుగులో అనేక లోడ్‌ల ఇసుకను తర లిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు అధికారుల తనిఖీల సమయంలో ఇసుక వాహనాలు పట్టుబడితే అనుమతులు పొందిన బిల్లులను చూపిస్తుండడం గమన్హారం.

పెద్దవాగు నుంచి ఇసుక రవాణా

అనంతారం, చొప్పాల, మోతే, భట్టుపల్లి, కరకగూడెం ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పెద్దవాగు నుంచి ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. మొన్నటి దాకా మండలకేంద్రం, పరిసర ప్రాంతాలకే రవాణా చేసిన అక్రమార్కులు.. తాజాగా ఒక అడుగు ముందుకేసి పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని కొందరు కాంట్రాక్టర్లు, ట్రాక్టర్‌ యజమానులతో సయోధ్య కుదుర్చుకుని సీసీ రహదారులు, ప్రభుత్వ భవనాలకు ఇసుక రవాణా చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాకు అనుమతులు ఉన్నాయని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. పట్టపగలు అది కూడా తహసీల్దార్‌ కార్యాలయం ముందు నుంచి ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఒక్క ట్రాక్టర్‌ లోడ్‌ ఇసుకకు రూ.1200, నుంచి రూ.1500 వరకు తీసుకుంటున్నారు. మరోవైపు ఇసుకను ఇష్టానుసారంగా తవ్వుతుండటంతో భూ గర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సమీప ప్రాంతాల పొలా ల్లో బోర్లలో తగ్గిన నీటిమట్టమే ఇందుకు కారణమని సంబంధిత రైతులు చెబుతున్నారు.


Read more