రూ.11కోట్లతో రోడ్ల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-09-25T05:03:04+05:30 IST

తల్లాడ మండలంలో రూ.11 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

రూ.11కోట్లతో రోడ్ల అభివృద్ధి
ముద్దునూరులో పల్లెదవాఖానాను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వెంకటవీరయ్య

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

తల్లాడ, సెప్టెంబరు 24: తల్లాడ మండలంలో రూ.11 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం బస్వాపురం, కలకొడిమ, కుర్నవల్లి, ముద్దునూరు, కేశ్వాపురం, లక్ష్మీపురం, రామానుజవరంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ముద్దునూరులో పల్లె దవాఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బతుకమ్మ చీరలను, ఆసరా పింఛన్‌కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ అంతర్రాష్ట రహదారి అయిన కుర్నవల్లి-ఉమ్మడదేవరపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.ఆరుకోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, సొసైటీ చైర్మన్లు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు వెంకట్‌లాల్‌, కట్టా రాము, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, తహసీల్దార్‌ గంటా శ్రీలత, ఎంపీడీవో బి.రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ పి.సురేష్‌, మండల వైద్యాధికారి వి.నవ్యకాంత్‌, సర్పంచ్‌లు లక్ష్మీనారాయణ, దాసూరావు, లక్ష్మీ, చింతల రేణుక, అలేఖ్య, ఓబుల సీతరామిరెడ్డి, శీలం కోటిరెడ్డి, ఆదూరి వెంకటేశ్వర్లు, వైస్‌ఎంపీపీ శీలం శివపార్వతి, ఎంపీటీసీలు అన్నెం కళావతి, రావూరి పద్మ, కోపిల కనకయ్య పాల్గొన్నారు.

Read more