మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2022-01-29T05:28:27+05:30 IST

బొగ్గు టిప్పర్‌ లారీ ఢీకొట్టిన సంఘటనలో నలుగురు దళిత పేద కూలీలు మృతి చెందడం ముమ్మాటికి సింగరేణి యాజమా న్యం నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపమే కారణమని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా అన్నారు.

మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి
వివరాలు తెలుసుకుంటున్న ఎడవల్లి

సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, జనవరి 28: బొగ్గు టిప్పర్‌ లారీ ఢీకొట్టిన సంఘటనలో నలుగురు దళిత పేద కూలీలు మృతి చెందడం ముమ్మాటికి సింగరేణి యాజమా న్యం నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపమే కారణమని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా అన్నారు. దీనికి సింగరేణి యాజమాన్యంతోపాటు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డి మాండ్‌ చేశారు. శుక్రవారం చంద్రుగొండ మండలం తిప్పనపల్లి జాతీయ రహదారిపై సుజాతనగర్‌ హరిజ నవాడ, తుంగారం గ్రామానికి చెందిన 17మంది కూలీలతో వెళ్తున్న వాహనాన్ని బొగ్గు టిప్పర్‌ ఢీకొన్న ప్రమాద ఘటనలో నలుగురు దళిత మహిళా కూలీలు మృత్యువాత పడగా మరో 14మంది తీవ్ర గాయాలపాలయ్యారు.  మృతదేహాలను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చడంతో నాయకులతోపాటు మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు.  అనంతరం మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రెక్కాడితే కానీ డొక్కాడని నలుగురు దళిత పేద మహిళల ఉసురు తీశారని, సింగరేణి యా జమాన్యానికి ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాలపై దృష్టి పెట్టి రక్షణను గాలి కొదిలేసిందని విమర్శించారు.  అతివేగం ఓవర్‌లోడ్‌ కారణంగా తరుచూ ఈ రోడ్డు పై ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహించారు.  గతంలో పదుల సం ఖ్యలో ప్రలు మృత్యువాతపడ్డారని, వందల సంఖ్యలో క్షత గాత్రులుగా మిగిలారని, ఇంత జరుగుతున్న యాజమా న్యం కానీ ప్రభుత్వం కాని పట్టించుకోకపోవడం దుర్మార్గ మైందన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం  బాధ్యత వహిం చి మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం, గా యాలపాలైన వారికి మెరుగైన కార్పోరేట్‌ వైద్యం అందిం చడంతోపాటు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. మృతదేహాలను సందర్శించిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై. శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కొమారి హనుమంతరావు, వైస్‌ ఎంపీపీ వి.మల్లిఖార్జున రా వు, నాయకులు వేల్పుల భాస్కర్‌, మల్లేష్‌ పాల్గొన్నారు. 

న్యాయం జరిగే వరకు పోరాడుతాం: ఎడవల్లి

 చంద్రుగొండ మండలం తిప్పనపల్లి సెంటరులో 17 మంది ప్రయాణిస్తున్న ఓ కంపెనీకి చెందిన పికప్‌ వాహ నం బొగ్గు లోడ్‌ లారీ బలంగా ఢీకొని నలుగురు మృతి చెందడం విచారకరమని టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ అన్నారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి వెళ్లి మృ తుల కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హా మీ ఇచ్చారు.  సింగరేణి యాజమాన్యం స్పందించి మృ తుల కుటుంబాలకు న్యాయం చేయాలని లేనిపక్షంలో నిర సన ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.  గ తంలో కూడా అవగాహన లేని, కనీసం లైసెన్స్‌ లేని డ్రైవ ర్లు నడపడం వల్లనే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయా లని, మృతులందరు కూలీ చేసుకుని బతికే వారని గుర్తు చేశారు. సింగరేణి యాజమాన్యం, ఆ లారీ ఓనర్‌ న్యాయం చేయాలని కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబును కోరా రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గిన్నారపు నా గేందర్‌, ఏలూరి రాజేష్‌ కుమార్‌,  సుజాతనగర్‌ మండల నాయకులు తాళ్లూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


Read more