ప్రయాణం నరకం

ABN , First Publish Date - 2022-11-27T22:57:08+05:30 IST

రాష్ట్రంలో అత్యంత అధ్వానంగా ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు వెంటనే మరమ్మ తులు చేయాలని సీఎం కేసీఆర్‌ చేసిన ఆదేశాలతోనైనా వైరా మండలంలో ఏళ్లతరబడి అధ్వా నంగా ఉన్న రోడ్ల మరమ్మతులకు మోక్షం లభించేనా అని ఇక్కడి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రయాణం నరకం
సోమవరంలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకుతో రోడ్డంతా గుంతలమయం

వైరా, నవంబరు 27: రాష్ట్రంలో అత్యంత అధ్వానంగా ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు వెంటనే మరమ్మ తులు చేయాలని సీఎం కేసీఆర్‌ చేసిన ఆదేశాలతోనైనా వైరా మండలంలో ఏళ్లతరబడి అధ్వా నంగా ఉన్న రోడ్ల మరమ్మతులకు మోక్షం లభించేనా అని ఇక్కడి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మండలంలో వైరా-జగ్గయ్యపేట, మధిర వెళ్లే ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డు మొత్తం అడుగడుగునా గుంతలమయంగా ఉంది. ప్రతినిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా పట్టించుకొనే దిక్కే లేదు. దాదాపు ఏడాది కిందట రూ.నాలుగు కోట్ల నిధులు మంజూరైనప్పటికీ ఇంతవరకు ఈ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టలేదు. వైరా ఆర్‌అండ్‌బీ సెక్షన్‌ పరిధిలో దాదాపు 13కిలోమీటర్లు రోడ్డు ఉంది. ఈ రోడ్డు మొత్తంలో దాదాపు నాలుగుకిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వానంగా ఉంది. దాదాపు అడుగు నుంచి రెండగుల లోతు గుంతలతో ప్రయాణాలు ప్రాణాం తకంగా ఉన్నాయి. నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు, జడ్పీ చైర్మన్‌ సహా పలువురు తిరుగుతున్నా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.

భారీ గుంతలు

వైరా-సోమవరం, సోమవరం-తాటిపూడి, జింకలగూడెం-రెబ్బవరం, గొల్లపూడి-పాలడుగు మధ్య భారీ గుంతలు ఉన్నాయి. ఐదేళ్ల నుంచి ఈ రోడ్డు దయనీయంగా ఉంది. ద్విచక్రవాహన చోదకు లు ఈ గుంతల్లో పడి నలుగురైదుగురు మృతిచెందారు. వందలాదిమంది క్షతగా త్రులయ్యారు. కేవలం నాలుగు కిలోమీటర్ల ప్రయాణం 30 నిమిషాలకు పైగా పడుతోంది. ఆర్‌అండ్‌బీ అధికారులు, సిబ్బంది అప్పుడప్పుడు గుంతల్లో మట్టి పోసినా ఒక్కరోజు కూడా ఉండటం లేదు. చిల్లకల్లు వద్ద జాతీయ ప్రధాన రహదారితో ఈ రోడ్డు అనుసంధానంగా ఉండటంతో బొగ్గు, సిమెంట్‌ సహా వివిధ రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు నిత్యం వేలసంఖ్యలో రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అధిక లోడ్‌తో వాహనాలు వెళ్తుండటంతో ఈ రోడ్డు మొత్తం గుంతలుగా త యారైంది. సోమవరం పాఠశాల సమీపంలో రోడ్డు అడుగుభాగంలోని మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకవుతూ తాగునీరు మొత్తం రోడ్డుపైన వరదలా ప్రవహిస్తుంది. అనేక సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. ఆర్‌అండ్‌బీ అధికారులు లీకవుతున్న పైపులైన్‌కు రిపేర్లు చేయకుండా వదిలేస్తుం డటంతో రోడ్డు మొత్తం గుంతలు, నీటితో నిండిపోతుంది. తాటిపూడి గోదాముల సమీపంలో మోటార్ల నుంచి పంటలకు సాగునీరందించే పైపులైన్‌ లీకవుతూ ఇక్కడ భారీ గుంతలేర్పడ్డాయి. గుంతల వద్ద ఇప్పటికే ద్విచక్రవాహనచోదకులు ముగ్గురు మృతిచెందారు. లెక్కలేనంత మంది గాయాలపాలయ్యారు. ఇక్కడ మరమ్మతుల కోసం ఇప్పటివరకు లక్షలాదిరూపాయలు వెచ్చిం చినా నాలుగైదేళ్లుగా ఈ రోడ్డు అధ్వానంగానే ఉంది. లీకవుతున్న పైపులైన్‌ను తొలగిం చడమో, మరమ్మతులు చేయటాన్ని విస్మరించి లీకవుతున్న నీటిలో రిపేర్లు చేస్తుండటం వల్ల ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు. ఏడాది కిందట రూ.నాలుగు కోట్లతో టెండర్లు పిలిచినా అధికారులు ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-11-27T22:57:10+05:30 IST