మానవాళి మనుగడకు పరిశోధనలు పెరగాలి

ABN , First Publish Date - 2022-11-24T23:45:09+05:30 IST

భూమి, గాలి, నీరు కలుషితమువున్న ప్రస్తుత కాలంలో మానవ మనుగడకోసం పరిశోధనలు పెరగాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత హరిప్రియ పేర్కొన్నారు. విజ్ఞానశాస్త్ర పురోగతిపైనే దేశపురోగతి ఆధారపడివుందన్నారు.

మానవాళి మనుగడకు పరిశోధనలు పెరగాలి
సైన్స ఫెయిర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ

24-yld-kv-11.jpgసైన్స ఫెయిర్‌లో విద్యార్థుల నమూనాలు

ఇల్లెందు ఎమ్మెల్యే బానోత హరిప్రియ

ఘనంగా భద్రాద్రి జిల్లా సైన్సఫెయిర్‌ ప్రారంభం

రికార్డు స్థాయిలో నమూనాల ప్రదర్శన

ఇల్లెందు, నవంబరు 24: భూమి, గాలి, నీరు కలుషితమువున్న ప్రస్తుత కాలంలో మానవ మనుగడకోసం పరిశోధనలు పెరగాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత హరిప్రియ పేర్కొన్నారు. విజ్ఞానశాస్త్ర పురోగతిపైనే దేశపురోగతి ఆధారపడివుందన్నారు. ఇల్లెందులోని జేకే కాలనీ సింగరేణి కాలరీస్‌ ఉన్నత పాఠశాలలో గురువారం భద్రాద్రి జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శన(సైన్సఫెయిర్‌)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ తల్లిదండ్రులకంటే గురువులకే విద్యార్థులు ప్రాధాన్యతనిస్తారని, ఉపాధ్యాయులు బోధనను వృత్తిగా కాకుండా సేవగా భావించాలన్నారు. నూతన పరిశోధనలకు విజ్ఞానశాస్త్రం, గణితబోధనలు కీలకమన్నారు. ఆయా శాసా్త్రల్లో విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించాలని కోరారు. సింగరేణి కాలరీస్‌ జనరల్‌ మేనేజర్‌ షాలేమ్‌రాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులు సైన్స పట్ల ఆసక్తి పెంచుకునేందుకు ఇల్లెందులో జిల్లా సైన్స ఫెయిర్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. భావితరాలకు ఉపయోగపడేలా పరిశోధన ఫలాలు అందాలని ఆకాంక్షించారు. జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మెన బానోత హరిసింగ్‌నాయక్‌, మునిసిపల్‌ చైర్మన దమ్మాలపాటి వెంకటేశ్వరావు, జిల్లా సైన్స అధికారి ఎస్‌.చలపతిరాజు, మునిసిపల్‌ కమిషనర్‌ అంకుశావళి, సింగరేణి డీజీఎం మోహనరావు, జిల్లా హెడ్‌మాస్టర్ల సంఘం అధ్యక్షుడు మాధవరావు, ప్రధానోపాధ్యాయుడు తిప్పర్తి వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ కౌన్సిలర్లు జేకే శ్రీను, చీమల సుజాత ప్రసంగించారు.

Updated Date - 2022-11-24T23:45:09+05:30 IST

Read more