తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే రేగా

ABN , First Publish Date - 2022-12-06T23:16:07+05:30 IST

తెలంగాణ పోలీసు వ్యవస్ధ దేశానికే ఆదర్శంగా నిలుస్తోదని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.

తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే రేగా
పోలీసు కాలనీని పరిశీలిస్తున్న రేగా

మణుగూరు, డిసెంబరు 6: తెలంగాణ పోలీసు వ్యవస్ధ దేశానికే ఆదర్శంగా నిలుస్తోదని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరులో నూతనంగా నిర్మిస్తున్న పోలీసు స్టేసన్‌ భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. క్వార్టర్ల నిర్మాణం కోసం కోటి రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడారు... పోలీసు ఉధ్యోగులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలీసు ఉధ్యోగుల సంక్షేమం కోసం ఉధ్యోగుల అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్నున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ పోలీసు వ్యవస్ధను సమర్ధవంతంగా తీర్చి దిద్ది ప్రజలకు మేలైన సేవలందింప జేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖ ఆధునికీకరణపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి అనేక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. ఖర్చుకు వెనకాడకుండా నూతన భవనాలను మంజూరు చేశారన్నారు. ఈ క్రమంలో శాంతి భధ్ర తల పర్యవేక్షణలో పోలీసు వ్యవస్ధ సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టానికి, వారి సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలీసులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. వారి భద్రతకు ముఖ్యమంత్రి ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. వారి సంక్షేమానికి అవసరమైన అన్ని కార్యక్రమాలూ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు, పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:16:11+05:30 IST