కోలుకున్న వనజీవి రామయ్య

ABN , First Publish Date - 2022-05-24T06:47:05+05:30 IST

కోలుకున్న వనజీవి రామయ్య

కోలుకున్న వనజీవి రామయ్య
వనజీవి రామయ్యను పరామర్శిస్తున్న ఇనకం టాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ రవికిరణ్‌ తదితరులు

నేడు డిశ్చార్జి చేయనున్న ప్రభుత్వాసుపత్రి వైద్యులు 

పరామర్శించిన ఇనకం ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌

ఖమ్మం కలెక్టరేట్‌, మే 23: ఇటీవల రోడ్డుప్రమాదానికి గురై తలకు, కాలికి తీవ్రంగా గాయమై చికిత్స పొందుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కోలుకున్నారని ఖమ్మం జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సోమవారం ఐసీయూలో ఉన్న రామయ్యను  వైద్యులు ఆర్‌ఎంవో డాక్టర్‌ బి.శ్రీనివాసరావు,  డాక్టర్‌ రాజశేఖర్‌, న్యూరో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ చైతన్య మరో సారి పరీక్షించారు. అయితే మంగళవారం మరో మారు అన్ని పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేయనున్నట్టు తెలిపారు. అయితే ఆయనకు కొద్దిరోజుల విశ్రాంతి అవసరమన్నారు. అలాగే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందతున్న వనజీవి రామయ్యను హైదరాబాద్‌కు చెందిన ఇనకం ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ జి.రవికిరణ్‌ , కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ జె.రవికిరణ్‌, ఐవోసీ మేనేజర్‌  వడ్య్తా ఫణిందర్‌ నాయక్‌  తదితరులు పరామర్శించారు. రామయ్యకు పుష్పగుచ్ఛాలు అందచేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతేడాది ఆజాదీకా అమృతోత్సవం కార్యక్రమంలో హైదరాబాద్‌లో ఇనకం ట్యాక్స్‌ కాలనీ పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యతిథిగా వనజీవి రామయ్య హాజరయ్యారని వారు గుర్తు చేశారు. వారి వెంట ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, ఏవో డాక్టర్‌ రాజశేఖర్‌, డాక్టర్‌ ఎం.నాగేశ్వరరావు, డైటీషియన ఎస్‌.మేరీ, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more