ఖాళీ స్థలాల నుంచే రేషన్ బియ్యం తరలింపు
ABN , First Publish Date - 2022-09-17T05:32:38+05:30 IST
వైరాలో శుక్రవారం ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన రేషన్ బియ్యం లారీలను ప్రైవేట్‌కు చెందిన ఖాళీస్థలాల్లో నిలిపి అక్కడి నుంచే రేషన్ షాపులకు బియ్యాన్ని సరఫరా చేశారు.

వైరా, సెప్టెంబరు 16: వైరాలో శుక్రవారం ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన రేషన్ బియ్యం లారీలను ప్రైవేట్‌కు చెందిన ఖాళీస్థలాల్లో నిలిపి అక్కడి నుంచే రేషన్ షాపులకు బియ్యాన్ని సరఫరా చేశారు. పౌరసరఫరాలశాఖకు చెందిన గోదాములు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్నాయి. 75వ తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా మార్కెట్‌యార్డులో సభ, భోజనాలు ఏర్పాటు చేశారు. దాంతో ఎఫ్‌సీఐ నుంచి బియ్యంతో వచ్చిన లారీలు వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వెళ్లే వీలు లేకుండా పోయింది. దాంతో కమ్మవారి కల్యాణమండపానికి ఎదురుగా ఒక ప్రైవేట్ ఖాళీస్థలంలోనే ఎఫ్‌సీఐ నుంచే లారీల్లో వచ్చిన రేషన్ బియ్యాన్ని రేషన్‌షాపులకు తరలించే లారీలకు బియ్యాన్ని ఎగుమతి చేశారు. ఇప్పటికే ఈనెలలో రేషన్‌బియ్యం సరఫరా ఆలస్యమైంది. ఈ పరిస్థితుల్లో మరోరోజు రేషన్‌షాపులకు బియ్యం సరఫరా ఆలస్యం కాకుండా చూసేందుకుగానూ బయటి నుంచి రేషన్‌షాపులకు బియ్యం తరలించామని సిబ్బంది తెలిపారు.