పర్ణశాల రామాలయంలో వసంతోత్సవం

ABN , First Publish Date - 2022-03-19T05:15:18+05:30 IST

పర్ణశాల రామాలయంలో శుక్రవారం డోలా పౌర్ణమి సందర్భంగా మూల, ఉత్సవమూర్తులకు వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

పర్ణశాల రామాలయంలో వసంతోత్సవం
వసంతోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

గోటి తలంబ్రాల సమర్పణకు పాదయాత్ర

దుమ్ముగూడెం మార్చి 18: పర్ణశాల రామాలయంలో శుక్రవారం డోలా పౌర్ణమి సందర్భంగా మూల, ఉత్సవమూర్తులకు వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పెళ్లి కొడుకుగా తయారు చేశారు. పసుపు కొమ్ములను దంచడంతోపాటు నవమి కళ్యాణానికి సంబందించి తలంబ్రాలను సిద్ధం చేశారు. విశ్వక్సేనపూజ, పుణ్యా హవచనం, రక్షాబంధనం, రక్షాధారణ వంటి కార్యక్రమాలను అర్చకులు కిరణ్‌కుమారాచార్యులు, భార్గవాచార్యులు శాస్త్రోపే క్తంగా జరిపించారు. సాయంత్రం తిరువీధి సేవ నిర్వహించారు. అలాగే నరసాపురం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రంలో స్వామి కల్యాణానికి కోసం గోటితో ఒలిచిన తలంబ్రాలను పాదయాత్ర ద్వారా భద్రాచలం చేరుకొని స్వామి వారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు శివనాగస్వామి, అరుణాచల భక్తబృందం పాల్గొన్నారు.

Read more