రామయ్యకు సువర్ణ తులసార్చన

ABN , First Publish Date - 2022-02-20T04:50:38+05:30 IST

భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి శనివారం ఆర్జిత సేవలో భాగంగా సువర్ణ తులసార్చన నిర్వహించారు. బంగారు తులసీదళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రామయ్యకు సువర్ణ తులసార్చన
నిత్యాన్నదానానికి విరాళం అందజేస్తున్న దృశ్యం

భద్రాచలం, ఫిబ్రవరి 19: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి శనివారం ఆర్జిత సేవలో భాగంగా సువర్ణ తులసార్చన నిర్వహించారు. బంగారు తులసీదళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి ఏపీలోని ప్రకాశం జిల్లా పొన్నూరు మండలం చలంకూరుకు చెందిన దేవినేని శ్రీరాములు, బ్రాహ్మణి దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. అంతకుముందుకు శ్రీరాములు, బ్రాహ్మణి దంపతులు రామయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా రుష్యమూక మ్యూజియంలో వస్తువులను ఆసక్తిగా గమనించారుజ


Read more