రాజ్యసభ సభ్యులకు ఘన సన్మానం

ABN , First Publish Date - 2022-11-18T22:35:44+05:30 IST

ఎంపీల స్వాగత కార్యక్రమం, కృతజ్ఞత సభకు పదివేలమందికిపైగా ప్రజలు తరలిరావడంతో తల్లాడ, కల్లూరు, పెనుబల్లిలో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.

రాజ్యసభ సభ్యులకు ఘన సన్మానం
గజమాలతో ఎంపీలకు సన్మానం

తల్లాడ/ కల్లూరు/ పెనుబల్లి, నవంబరు 18: ఎంపీల స్వాగత కార్యక్రమం, కృతజ్ఞత సభకు పదివేలమందికిపైగా ప్రజలు తరలిరావడంతో తల్లాడ, కల్లూరు, పెనుబల్లిలో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. రాజ్యసభ సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బండి పార్ధసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర తొలిసారిగా సత్తుపల్లి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో తల్లాడలో శుక్రవారం వారికి ఘనస్వాగతం లభించింది. సత్తుపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించే ముందు తల్లాడలో ఎంపీలకు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. తల్లాడలోని కొత్త హెచ్‌పీ బంకు వద్దనుంచి రింగ్‌రోడ్డు సెంటర్‌వరకు రెండు కిలోమీటర్లకుపైగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కోయ, కొమ్ము, డోలు నృత్యం, లంబాడా మహిళలు నెత్తిన బిందెలతో నృత్యం, మహిళలు బతుకమ్మతో కోలాట నృత్యం ఆకట్టుకున్నాయి. క్రేన్‌ సాయంతో ఎంపీలు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యేలను గజమాలతో సన్మానించారు. ర్యాలీలో ప్రత్యేక వాహనంపై రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, పార్దసారథిరెడ్డి, రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, లావుడ్యా రాములునాయక్‌, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం రింగ్‌రోడ్డు సెంటర్లో ఎమ్మెల్యే వెంకటవీరయ్య అధ్యక్షతన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత సభ జరిగింది. ఈ సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా పట్ల ప్రత్యేక అభిమానంతో జిల్లాకు చెందిన బండి పార్ధసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ్యులుగా సీఎం కేసీఆర్‌ అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి సమిష్టి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థచైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, రైతుబంధు జిల్లా కన్వీనర్‌ నలమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్‌లు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, జోన్‌ కన్వీనర్లు శ్రీనివాసరెడ్డి, కోటిరెడ్డి, దాసూరావు, చలపతిరావు, శ్రీనివాసరావు, సర్పంచ్‌లు వెంకట్‌, కోటిరెడ్డి, శ్రీనివా సరావు, సీతారామిరెడ్డి, చింతల రేణుక, అయిలూరి లక్ష్మీ, కోసూరి వెంకటనర్సింహారావు, ఎంపీటీసీలు బ్రహ్మం, కనకయ్య, షేక్‌.యూసూబ్‌, వీరభద్ర రావు, వీరకృష్ణ, కృష్ణప్రసాద్‌, జీవీఆర్‌, నాగేశ్వరరావు, రామిరెడ్డి, జమలయ్య, నర్సింహారావు, సత్యం పాల్గొన్నారు.

జిల్లాపై కేసీఆర్‌కు ఎంతో మమకారం

కల్లూరులో శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి ప్రసంగించారు, సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ అభినందన సభలో తమకు ఆదరించిన ప్రజానీకానికి అభినందనలు తెలిపారు. కల్లూరు పట్టణంలో నూతన బస్డాండుకు పక్కా భవానాల నిర్మాణ అభివృద్ధికి సహకారిస్తానని ఈ సందర్భంగా పార్థసారఽథిరెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రసంగిస్తూ కేసీఆర్‌ నాయక్వతంలో రాష్ట్రంతో పాటుగా ఈ జిల్లా ఎంతోగాను అభివృద్ధి జరిగిందన్నారు.

రాజ్యసభ సభ్యులకు ఘన సన్మానం

కల్లూరులో జరిగిన అభినందన సభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్దసారధిరెడ్డిలకు టీఆర్‌ఎస్‌ మండల కమిటీ తరుపున సన్మానించారు. అంతకు ముందు టీటీడీ కళ్యాణ మండపం నుంచి వారికి వేలాది మంది ప్రజలు ఎమ్మెల్యే సండ్ర సమక్షంలో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీలు తాత మధు, పల్లా రాజేశ్వరరెడ్డి, కల్లూరు మండల టీ ఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రామారావు, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్‌, రైతుబంధు ప్రతినిధులు లక్కినేని రఘు, పసుమర్తి చందర్‌రావు. కోఆప్షన్‌ సభ్యులు ఇస్మాయిల్‌, కమ్లి, టీఆర్‌ఎస్‌ నాయకులు కొరకొప్పు ప్రసాద్‌, పెడకంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీల సన్మానానికి తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

రాజ్యసభ సభ్యులుగా బండి పార్ధసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సత్తుపల్లి నియో జకవర్గానికి వస్తున్న సందర్భంగా సన్మాన కార్యక్రమానికి పెనుబల్లి మండలం నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం భారీగా తరలివెళ్లారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపు మేరకు ప్రతిగ్రామం నుంచి మోటారుసైకిళ్లు, ఆటోలు, కార్లలో తరలివెళ్లారు.

Updated Date - 2022-11-18T22:35:44+05:30 IST

Read more