కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

ABN , First Publish Date - 2022-02-17T05:05:01+05:30 IST

మండల పరిధిలోని జీళ్లచెరువులోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శ్రీవారి కల్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. నాలుగురోజులుగా దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్పవాలు జరుగుతున్నాయి.

కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

వైభవంగా జీళ్లచెరువు 

శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం

 కూసుమంచి, ఫ్రిబ్రవరి 16: మండల పరిధిలోని జీళ్లచెరువులోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శ్రీవారి కల్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. నాలుగురోజులుగా దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్పవాలు జరుగుతున్నాయి. స్వామివారి కల్యాణానికి ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు స్వామివారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. కల్యానానికి వచ్చిన భక్తులకు బోగా శ్రీనివాసరావు వితరణతో సమకూర్చిన అన్నదాన కార్యాక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌, ధర్మకర్తలమండలి చైర్మన్‌ బొడ్డు నరేందర్‌, గ్రామసర్పంచి కొండ సత్యం, ఎంపీటీసీ ఉమాశ్రీనివాస్‌, అర్చకులు సీతారామానుజాచార్యులు, జనార్ధనాచార్యులు, రాధాకృష్ణమాచార్యులు పాల్గొన్నారు. 

Read more