కార్మికుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-25T05:50:50+05:30 IST

సింగరేణిలో కార్మికుల పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి డైరెక్టర్‌ (పా) ఎస్‌. చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు.

కార్మికుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి

 సింగరేణి డైరెక్టర్‌ (పా) చంద్రశేఖర్‌

రుద్రంపూర్‌, (సింగరేణ) ఆగస్టు 24: సింగరేణిలో కార్మికుల పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి డైరెక్టర్‌ (పా) ఎస్‌. చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహంచారు. ఆయన మాట్లాడుతూ సింగరేణిలో వివిధ రకాల క్యాటగిరిల ఉద్యోగాల నియామకాల పక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్మికుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఏరియా మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌తో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు. నూతనంగా డైరెక్టర్‌ (పా)గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్‌ను అధికారులు సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జీఎంలు ఆందె ఆనందరావు, కట్టా బసవయ్య, కుమార్‌ రెడ్డి,  చీఫ్‌ సెక్యూరిటీ అధికారి శశిధర్‌ రాజు, ఎజీఎంలు బీఆర్‌. దీక్షితులు, హనుమంతరావు, డీజీఎంలు కవితానాయుడు, కే. శ్రీనివాసరావు, దన్‌పాల్‌ శ్రీనివాస్‌, జీవి. కిరణ్‌కుమార్‌, ఎజీఎం మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Read more