శాఖల సమన్వయంతో పామాయిల్‌ విస్తరణ

ABN , First Publish Date - 2022-11-02T23:04:52+05:30 IST

తెలంగాణాలో పామాయిల్‌ తోటల విస్తరణలో ఉద్యానశాఖ, వ్యవసాయ శాఖ సమన్వంతో ముందుకెళ్లడం జరుగుతుందని జిల్లా ఉద్యానశాఖాధికారి మరియన్న, జిల్లా వ్యవసాయ శాఖాధికారి అభిమన్యు అన్నా రు.

శాఖల సమన్వయంతో పామాయిల్‌ విస్తరణ
మాట్లాడుతున్న మరియన్న

అశ్వారావుపేట, నవంబరు 2: తెలంగాణాలో పామాయిల్‌ తోటల విస్తరణలో ఉద్యానశాఖ, వ్యవసాయ శాఖ సమన్వంతో ముందుకెళ్లడం జరుగుతుందని జిల్లా ఉద్యానశాఖాధికారి మరియన్న, జిల్లా వ్యవసాయ శాఖాధికారి అభిమన్యు అన్నా రు. బుధవారం వారు అశ్వారావుపేటలోని ఆయిల్‌పామ్‌ నర్సరీలను సందర్శించి, మొక్కల గుర్తింపుపై నియోజకవర్గంలోని మండలాల ఏఈఓలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 14,162 ఎకరాలకు లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగిందని, ఇప్పటి వరకు 5,687 ఎకరాలకు మొక్కలు సరఫరా పూర్తి అయ్యిందని, మరో 8475 ఎకరాలకు మొక్కలు సిద్దంగ ఉన్నట్టు ప్రకటించారు. సాగు విస్తరణలో జాప్యం జరగటంతో వ్యవసాయ శాఖ ఏఈఓలను సమన్వయం చేసుకొని లక్ష్యాన్ని సాధించే విధంగా ప్రణాళిక సిద్దం చేసామన్నారు. ప్రతి ఏటా పామాయిల్‌ సాగుచేసే రైతులకు రాయితీల క్రింద ఎకరాకు రూ.4200ల చొప్పున నాలుగేళ్ళకు రూ.16,800లు రైతులకు అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో టెక్నికల్‌ ఏడీఏ లాల్‌నంద్‌, అశ్వారావుపేట ఏడీఏ అబ్జుల్‌ బే గం, టెక్నికల్‌ ఏవోలు సాయి నారాయణ, దీపక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T23:04:52+05:30 IST
Read more