ఆగని దందా.. అదే పంథా

ABN , First Publish Date - 2022-11-27T22:06:00+05:30 IST

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశకు ఆయిల్‌ఫామ్‌ మొక్కల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతంలోని నర్సరీల్లో పెంచిన మొక్కలను సబ్సిడీపై రైతులకు అందజేయాల్సి ఉంది.

ఆగని దందా.. అదే పంథా
మేడిశెట్టివారిపాలెంలో ఆపిన పామాయిల్‌ లారీ

మొక్కల విక్రయ సమయంలో వ్యక్తుల లావాదేవీలు

కొనసాగుతున్న ఆయిల్‌ఫామ్‌ మొక్కల అక్రమ రవాణా

జనగాం నుంచి ఏపీలోని పంగిడికి తరలింపు

దళారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వ్యాపారం

సత్తుపల్లి, నవంబరు 27: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశకు ఆయిల్‌ఫామ్‌ మొక్కల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతంలోని నర్సరీల్లో పెంచిన మొక్కలను సబ్సిడీపై రైతులకు అందజేయాల్సి ఉంది. కానీ ఆ మొక్కలు అడ్డదారిలో పక్క రాషా్నికి తరలుతున్నాయి. రాష్ట్రంలో నర్సరీల్లో పెంచిన మొక్కలను రైతులకు భారీ సబ్సిడీతో సరఫరా చేస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రప్రభుత్వం ఆయిల్‌ఫామ్‌ సాగు ప్రోత్సహిస్తూ ఉండటంతో ఇక్కడి రైతులు కూడా ఆయిల్‌ఫామ్‌ సాగుపై దృష్టి సారించారు. దాంతో వేల మంది రైతులు తెలంగాణలో ఆయిల్‌ఫామ్‌ మొక్కల కోసం ధరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తుండగా ఇక్కడి రైతులకు సకాలంలో మొక్కలు అందకపోగా కొంతమంది అక్రమార్కులు ఇక్కడ ఆయిల్‌ఫెడ్‌ నర్సరీల నుంచి సేకరించిన మొక్కలను ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులకు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈనెల 13వ తేదీన రాషా్ట్రనికి చెందిన మొక్కలు ఆంధ్రప్రదేశలోని ఏలూరు జిల్లా పోతునూరు గ్రామంలో రైతుకు అక్రమంగా విక్రయించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘తెలంగాణ టూ ఆంధ్రా’ అనే శీర్షికతో కథనం వెలువడటంతో అక్రమార్కులు సదరు 500మొక్కలను రాత్రికి రాత్రే తెలంగాణ ప్రాంతానికి తీసుకువచ్చి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అధికారులు మాత్రం అప్పట్లో ఇవి ఆయిల్‌ఫెడ్‌ మొక్కలు కాదని తమ బాధ్యతల నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో పామాయిల్‌ నర్సరీల నుంచి పెద్దమొత్తంలో మొక్కలు అక్రమంగా తరలిపోతున్నా సంబంధిత అధికారులు చేష్ఠలుడిగి చూస్తున్నారు. ఒకొక్క మొక్కను రూ.300-400చొప్పున దళారులు ఆంధ్రాలోని రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లో అక్రమంగా తరలిపోయే పామాయిల్‌పై నిఘా లేకపోవడం, ఆయిల్‌ఫెడ్‌ నర్సరీల నుంచి విడుదలైన మొక్కలు ఎక్కడికి వెళుతున్నాయనే దానిపై పర్యవేక్షణ చేయకపోవడంపై ఆయిల్‌ఫామ్‌ రైతుసంఘం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అనేక జిల్లాల్లో పామాయిల్‌ మొక్కల కోసం రైతులు ఎదురు చూస్తున్నా రైతులకు మొక్కలు దక్కకడం లేదు. ఇదే సమయంలో అక్రమ రవాణాను సైతం ఆయిఫెడ్‌ అధికారులు నిలువరించలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తాజాగా శనివారం రాత్రి సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద జనగాం నుంచి పామాయిల్‌ మొక్కల లోడుతో ఆంధ్రాకు వెళ్తున్న లారీని పామాయిల్‌ రైతులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దీనిని మొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీ్‌సస్టేషనకు తరలించి ఆదివారం మధ్యాహ్నం సత్తుపల్లి పోలీ్‌సస్టేషనలో అప్పగించారు. దీనిపై ఆయిల్‌ఫామ్‌ రైతుసంఘం నాయకులు సత్తుపల్లి పోలీ్‌సస్టేషనలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

ఆయిల్‌పామ్‌ మొక్కల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆదివారం సత్తుపల్లి మండలానికి చెందిన రైతులు తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి, ఆళ్ల నాగేశ్వరరావు, వేంపాటి లక్ష్మీనారాయణలు పోలీ్‌సస్టేషర్‌లో ఫిర్యాదు చేశారు. తమతో పాటు వేలాది మంది రైతులు ఆయిల్‌ఫామ్‌ తోటలు సాగు చేస్తున్నారని, మొక్కల కోసం దరఖాస్తు చేసినా సరఫరాలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా శనివారం రాత్రి మొక్కలతో పట్టుబడిన టీఎ్‌స25టీ 2016నెంబర్‌ గల లారీని నిలిపి విచారించగా తనవద్ద ఎటువంటి కాగితాలు లేవని, కేవలం కిరాయికి వచ్చామని డ్రైవర్‌ తమకు చెప్పాడన్నారు. ఇంతలో ఏపీ రిజిస్ట్రేషనతో ఉన్న ఓ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇవి సత్తుపల్లి మండలం సిద్దారానికి చెందిన కిన్నెర రాంబాబు మధ్యవర్తిగా ఉండి రూ.300చొప్పున కొనిపెట్టాడని చెప్పారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆ లారీని స్టేషనకు తరలించినట్లు తెలిపారు.

మొక్కల తరలింపుపై విచారణ చేస్తున్నాం

కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ రాష్ట్ర ఛైర్మన

పామాయిల్‌ మొక్కలు ఆంధ్రాతో పాటు వేంసూరు మండలానికి తరలుతున్నాయనే విషయంపై విచారణ సాగుతోంది. జనగాం నర్సరీ నుంచి ఆంధ్రాకు తరలుతున్న పామాయిల్‌ మొక్కల లారీ పట్టివేత విషయంలో నలుగురు వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రైతులను ప్రోత్సహించేందుకు పామాయిల్‌ సాగు విస్తీర్ణం పెంచేందుకు నర్సరీల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలను రైతులకు పంపిణీ చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో మొక్కలు అక్రమంగా అక్రమార్కుల ద్వారా తరలితే సహించమని, ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవన్నారు.

Updated Date - 2022-11-27T22:06:01+05:30 IST