‘వరద’ బాధలు వర్ణనాతీతం

ABN , First Publish Date - 2022-07-18T07:08:09+05:30 IST

The sufferings of the 'flood' are indescribable

‘వరద’ బాధలు వర్ణనాతీతం
పాములపల్లిలో వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న గవర్నర్‌ తమిళి సై

బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక

గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన

అశ్వాపురంలో వరద బాధితులకు పరామర్శ

గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలన

అశ్వాపురం, జూలై 17: గోదావరి వరదల నేపఽథ్యంలో భద్రాద్రి జిల్లాలోని వరద బాధితుల బాధలు వర్ణనాతీతమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన తెలిపారు. వరద బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని, బాధితుల కష్టానష్టాలను తెలుసుకునేందుకే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. అశ్వాపురం మండలంలోని పాములపల్లి, చింతిర్యాల కాలనీ గ్రామాల్లో ఆదివారం పర్యటించిన గవర్నర్‌ గోదావరి వరదలతో నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో నడుచుకుంటూ వెళ్లి పరిసరాలను పరిశీలించి ముంపు బాధితులను పరామర్శించారు. అనంతరం అశ్వాపురంలోని రెండు ఫంక్షనహాళ్లలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి.. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన మెడికల్‌కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ గోదావరి వరదలకు భద్రాచలం ప్రాంతానికి జరిగిన తీవ్రనష్టాన్ని పరిశీలించేందుకే వచ్చానని, నివేదికలు తీసుకుని ప్రభుత్వానికి అందజేసి బాధితులకు తగిన న్యా యం జరిగేలా చూస్తానన్నా రు. వరద బాధిత కుటుంబాలకు దోసపాటి రంగారావు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఫంక్షన హాల్‌ను పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు దోసపాటి కుటుంబసభ్యులను, రెడ్‌క్రాస్‌ సొసైటీసభ్యులను అభినందించారు. మానవతా ధృక్పథంతో బాధితులకు అందరూ సాయమందించాలని కోరారు. 


గోడు వినాలంటూ గవర్నర్‌ను అడ్డగించిన బాధితులు

అశ్వారావుపేట మండల పర్యటనకు వచ్చిన గవర్నర్‌ తమిళిసైకి చేదు అనుభవం ఎదురైంది. పర్యటనలో భాగంగా అశ్వాపురంలోని ఓ ఫంక్షన హాల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించిన గవర్నర్‌ బాధితులకు మెడికల్‌ కిట్లు అందజేసి వెళుతున్న క్రమంలో బాఽధితులు ఒక్కసారిగా గవర్నర్‌కు అడ్డంగా నిలిచి తమ గోడు వినాలని వేడుకున్నారు. స్పందించిన గవర్నర్‌ మళ్లీ ఫంక్షనహాల్‌లోకి వెళ్లి సమస్యలను విని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తామని తెలిపారు. అయినా బాధితులు వినకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని గవర్నర్‌ను వాహనం ఎక్కించి పంపించారు. గవర్నర్‌ వెంట ప్రత్యేక కార్యదర్శి సురేంద్రమోహన, కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత, మణుగూరు ఇనచార్జ్‌ డీఎస్పీ వెంకటేశ్వరబాబు, అడ్మిన ఏఎస్పీ కేఆర్‌కే ప్రసాదరావు, ఐటీడీఏ డీడీ రమాదేవి, అశ్వాపురం తహసీల్దార్‌ సురే్‌షకుమార్‌ ఉన్నారు. ఇదిలా ఉండగా గవర్నర్‌ తమిళిసై పర్యటనకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ రేగా కాంతారావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. Read more